నిహారిక పెళ్లి కుదరడం వెనక ఇంత కథ జరిగిందా? వరుడి తండ్రికి చిరు ఎలా పరిచయమంటే?

నిహారిక పెళ్లి కుదరడం వెనక ఇంత కథ జరిగిందా? వరుడి తండ్రికి చిరు ఎలా పరిచయమంటే?

by Megha Varna

మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదల వివాహం గురించి ఇప్పటిదాకా రకరకాల రూమర్స్ హల్చల్ చేసాయి.అయితే నిహారిక కొణిదల వివాహం గురించి ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చేసింది. గుంటూరు ఐజీ కుమారుడు వెంకట చైతన్య జొన్నలగడ్డ ను వివాహం చేసుకోబుతున్నారు నిహారిక కొణిదల.ఇప్పటికే నిహారిక ,చైతన్య కలిసి తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.ఆ వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

నిహారిక ,చైతన్య కలిసి కౌగలించుకుని తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.అయితే ఆ ఫోటోలను చుసిన నెటిజన్లు నిహారిక లవ్ మ్యారేజ్ చేసుకోబోతుంది అని అనుకున్నారు కానీ పెద్దలు కుదిర్చిన వివాహమే అని తరువాత తెలిసింది .ఇరు కుటుంబాల పెద్దలు కలిసి వివాహం గురించి పూర్తిగా చర్చించుకున్న తర్వాతే నిహారిక ,చైతన్య ఒకరికొకరు పరిచయం అయ్యారని తెలుస్తుంది.

అయితే చిరంజీవి తండ్రి గారు అయిన వేంకటరావు కొణిదెల పోలీస్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నపుడు ఆయనకు గుణ వెంకరత్నం అనే స్నేహితుడు ఉండేవారు.అయితే వెంకటరత్నం కూతురు పద్మ ను ఐజీ ప్రభాకరరావు కి ఇచ్చి వివాహం చేసారు.కాగా మెగాస్టార్ చిరంజీవి కి మొదటి నుండి వెంకటరత్నం తో ఎక్కువ సాన్నిహిత్యం ఉండడం వలన ప్రభాకరరావు తో కూడా పరిచయం ఏర్పడి ఆ పరిచయం నేటికీ కొనసాగుతూ వచ్చింది.

అయితే ప్రభాకరరావు ,చిరంజీవి కలిసినప్పుడు ప్రభాకరరావు కుమారుడు అయిన చైతన్య వివాహం గురించి చర్చ జరిగింది.అయితే చైతన్య ను నిహారిక కు ఇచ్చి వివాహం చెయ్యచ్చు కదా అని చిరంజీవి ప్రభాకరరావు తో అన్నారు.దీంతో ప్రభాకరరావు కూడా నిహారిక తో వివాహం జరిపించడానికి సరే అని అనడంతో ఈ వివాహం కుదిరింది అని తెలుస్తుంది.


You may also like