చైనా నిజాలు దాచిందనడానికి ఇదే ప్రూఫ్ అంటున్న హార్వర్డ్.? కరోనా మొదలైంది డిసెంబర్ లో కాదంట…?

చైనా నిజాలు దాచిందనడానికి ఇదే ప్రూఫ్ అంటున్న హార్వర్డ్.? కరోనా మొదలైంది డిసెంబర్ లో కాదంట…?

by Mohana Priya

Ads

డిసెంబర్ 27 నుండి చైనాలో కరోనా కనిపించింది. అంతకుముందు ఎప్పుడూ ఏ హాస్పటల్ లోనూ కరోనా కి సంబంధించిన అనారోగ్య లక్షణాలు ఎక్కడా నమోదు కాలేదు. డిసెంబర్లో ఈ వైరస్ గురించి గుర్తించిన వెంటనే అప్రమత్తం అయ్యాం. వెంటనే జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. ఇది చైనా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన శ్వేత పత్రం లో ఉన్న  సందేశం.

Video Advertisement

కానీ ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ వారు నిర్వహించిన ఒక పరిశోధనలో ఇది అబద్ధం అని తేలింది. చైనా వాళ్ళు చేసిన నిర్లక్ష్యం కారణంగా ముందు ఆ వైరస్ గురించి ఎవరికీ తెలియలేదు. తర్వాత పరిస్థితులు వారి చేతిలో నుంచి చేజారిపోయి ఈ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. ఎన్నో రకాల నష్టాలు వస్తున్నాయి అవి ఆరోగ్య నష్టాలు కావచ్చు లేక పోతే ఆర్థిక నష్టాలు కావచ్చు.

మొత్తానికి ప్రపంచం మొత్తం స్తంభించిపోయే పరిస్థితి వచ్చింది. దీని కారణంగా మిగిలిన దేశాల ప్రభుత్వాలు అన్ని చైనా మీద ఎంతో కోపంగా ఉన్నాయి. ఇంకా ఎన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయంతో చైనా ప్రభుత్వం ఇలాంటి కథ అల్లింది అని తెలిసింది.

అసలు విషయం ఏంటంటే కరోనా లక్షణాలు గత ఏడాది ఆగస్టులో నే కనిపించాయట. చైనా ప్రజలు చేసిన సెర్చ్ హిస్టరీ చూస్తే అందులో చాలామంది దగ్గు కి సంబంధించిన సమాచారం కోసమే ఎక్కువగా వెతికారు. అప్పటినుండే చైనా ఆస్పత్రులలో అనారోగ్య సమస్య కేసులు ఎక్కువగా నమోదవడం మొదలైంది. వూహాన్ లో  అప్పటికే వైరస్ వ్యాప్తి చెందుతోంది.

“సీ ఫుడ్ కి ఈ వైరస్ కి ఎటువంటి సంబంధం లేదు. సహజంగానే చైనాలో వైరస్ మొదలైంది. వూహాన్ లో అప్పటికే వ్యాపించి ఉందన్న వార్త వినిపించింది. ఎంతోమంది పేషెంట్స్ హాస్పిటల్స్ కి వచ్చినట్టు శాటిలైట్ దృశ్యాల్లో కనిపించింది.అంతే కాదు గూగుల్ లో దగ్గు గురించి చాలామంది చైనా వాళ్ళు వెతికారు అంట.

ముందు మాకు కూడా ఆగస్టులో అనారోగ్యసమస్యలు వచ్చినంత మాత్రాన అది కరోనా గురించి కాదేమో, మాది కేవలం అనుమానం ఏమో అనిపించింది. కానీ ఈ సంఘటనలన్ని పరిశీలించి చూస్తే కరోనా ఆవిర్భావం డిసెంబర్ కంటే ముందే మొదలయింది అని తెలుస్తోంది. ” అని చెప్పారు హార్వర్డ్ పరిశోధకులు.

ఇది కూడా ఎంతవరకు నిజమో తెలియదు. ఎందుకంటే ముందు ముందు పరిశోధనలు పెరిగే కొద్దీ కొత్త కొత్త విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అసలు ఈ వైరస్ ఎప్పుడు మొదలైందో ఎలా వచ్చిందో అన్ని విషయాలు చైనా వాళ్ళ కంటే ఇంకెవరికి కరెక్ట్ గా తెలిసే అవకాశాలు లేవు. చైనా మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపడేసింది. వాళ్ళు ఒక పరిష్కారం చూపిస్తే మరింత నష్టం జరగకుండా ఆపడానికి వీలవుతుంది.

source: hindustantimes


End of Article

You may also like