నిఖిల్ కి కాబోయే భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా.? పుట్టబోయే బిడ్డ పేరు కూడా ఫిక్స్!

నిఖిల్ కి కాబోయే భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా.? పుట్టబోయే బిడ్డ పేరు కూడా ఫిక్స్!

by Megha Varna

హ్యాపీ డేస్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నిఖిల్. స్వామి రారా సినిమాతో హిట్ కొట్టాడు.ఆ వెంటనే కార్తికేయతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. డిఫరెంట్ జోన్ మూవీస్ చేస్తూ ఆకట్టుకుంటూ వచ్చాడు. రీల్ లైఫ్‌లో ఎంతోమందితో జోడీకట్టిన హీరో నిఖిల్‌కు రియల్ లైఫ్ జోడీ దొరికింది.

Video Advertisement

త్వరలోనే పెళ్లికొడుకు కానున్నాడు. డాక్టర్‌ పల్లవి వర్మను నిఖిల్‌ వివాహం చేసుకోనున్నారు. కొద్దికాలంగా పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న నిఖిల్‌ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్దమయ్యాడు. దీంతో శనివారం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య నిఖిల్‌, పల్లవిల నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. ఏప్రిల్‌ 16న ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒకటి కానున్నట్టుగా సమాచారం. పల్లవి వర్మకు నిఖిల్‌ ప్రపోజ్‌ చేస్తున్న ఫొటో ప్రస్తుతం నెటింట్లో చక్కర్లు కొడుతోంది.

గుట్టుచప్పుడుకాకుండా నిశ్చితార్థం చేసుకున్నాడు. దీనికి కారణం ఏంటో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇక తనకు కాబోయే భార్య గురించి మాట్లాడుతూ నిఖిల్ ” తను ఒక డాక్టర్.. తనెప్పుడు తనను డిస్టర్బ్ చేయదు. షూటింగ్‌లో ఉండే ఫోన్ చేయదనీ, తన ఫోన్ కూడా చెక్ చెయ్యదనీ చెప్పాడు. అంతేకాదు చాలా మంచిదని, పార్టీలకు వెళ్లినా అడగదని తెలిపాడు.

సరే లేట్ అయినా పర్లేదని అంటుందని కాబోయే భార్య గురించి చెప్పుకొచ్చాడు.మొత్తానికి ఓ వైపు నితిన్ పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ కాగా ఇప్పుడు మరో యువ హీరో నిఖిల్ కూడా రెడీ అయిపోయాడు. అంతేకాదు ఓ ఇంటర్వ్యూ లో తనకు పుట్టబోయే పాప పేరు కూడా ఫిక్స్ చేశానని చెప్పాడు. ‘మాయా సిద్దార్థ్’ అంటే ఎంత బాగుంది కదా అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టాడు నిఖిల్.


You may also like

Leave a Comment