Karthikeya-2 Review : కార్తికేయ-2 సినిమాతో “నిఖిల్” హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Karthikeya-2 Review : కార్తికేయ-2 సినిమాతో “నిఖిల్” హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya
  • చిత్రం : కార్తికేయ-2
  • నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి.
  • నిర్మాత : అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్
  • దర్శకత్వం : చందు మొండేటి
  • సంగీతం : కాలభైరవ
  • విడుదల తేదీ : ఆగస్ట్ 13, 2022

karthikeya 2 movie review

Video Advertisement

స్టోరీ :

ఇందులో కూడా కార్తికేయ (నిఖిల్) ఒక కొత్త విషయంపై దాని వెనకాల ఉన్న రహస్యం ఛేదించడానికి వెళ్తాడు. సినిమా మొత్తం కృష్ణుడి పట్టి చుట్టూ తిరుగుతుంది. అసలు కార్తికేయ ఏ పని మీద వెళ్ళాడు? అ రహస్యాన్ని ఎలా తెలుసుకున్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

karthikeya 2 movie review

రివ్యూ :

నిఖిల్ హీరోగా కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన కార్తికేయ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఆ సినిమాకి పార్ట్ 2 ఉంటుంది అనగానే ప్రేక్షకులు అందరూ కూడా అది ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూశారు. మొదటి భాగం మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ గా నడుస్తుంది. రెండవ భాగం ట్రైలర్ చూస్తే కూడా ఈ సినిమా కూడా అలాగే ఉండబోతోంది అని అర్థం అయింది. మొదటి భాగంతో పోల్చి చూస్తే ఈ సినిమాలో కథ లోతు ఇంకా ఎక్కువగా ఉంటుంది. సినిమా మొత్తం ఫోకస్ కూడా కేవలం ఒక్క విషయం మీదే ఉంటుంది.

karthikeya 2 movie review

ఒక సినిమాకి కథ చాలా బలమైనది. కాబట్టి ఆ కథ ఎంత బాగుంటే సినిమా మీద ప్రేక్షకుల ఆసక్తి కూడా అంతే బాగుంటుంది. సినిమా మొదటినుంచి చివరి వరకు సస్పెన్స్ తో సాగుతుంది. ఇంటర్వెల్ కూడా నెక్స్ట్ ఏమవుతుంది అనే సస్పెన్స్ సృష్టిస్తుంది. సినిమాకి కథతో పాటు మరొక ముఖ్య బలం నిఖిల్ నటన. ఈ సినిమా మొదటి భాగానికి కొనసాగింపు కాదు. కొత్త స్టోరీతోనే నడుస్తుంది. మొదటి భాగంలో కార్తికేయ ఒక ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ అయితే ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ డాక్టర్. నిఖిల్ కూడా అలాగే ఒక డాక్టర్ లాగా ఆ పాత్రకి ఎంత ఎమోషన్స్ అయితే అవసరమో అంతే ఎమోషన్స్ తెరపై చూపిస్తూ నటించారు.

karthikeya 2 movie review

మిగిలిన పాత్రలు అన్నీ కూడా నిఖిల్ పాత్రకి సహాయం చేయడానికి ఉంటాయి. కానీ సినిమా మొత్తాన్ని నిఖిల్ నడిపించారు. అనుపమ పరమేశ్వరన్ తన పాత్ర పరిధి మేరకు నటించారు. శ్రీనివాస్ రెడ్డి కామెడీ వర్కౌట్ అయ్యింది. అలాగే ఆదిత్య మీనన్, మరొక ముఖ్యపాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా వాళ్ల పాత్రలకి తగ్గట్టుగా నటించారు. సినిమా కథ అంతా బానే ఉన్నా కూడా కొన్ని సీన్స్ మాత్రం లాజిక్ లేకుండా అనిపిస్తాయి. టెక్నికల్ గా  సినిమా చాలా బాగుంది. కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. అలాగే కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • నిఖిల్
  • లొకేషన్స్
  • కథ

మైనస్ పాయింట్స్:

  • లాజిక్ లేనట్టుగా అనిపించే కొన్ని సీన్స్

రేటింగ్ :

3.25/5

ట్యాగ్ లైన్ :

ఇటీవల విడుదలైన సినిమాలు అన్నిట్లో కూడా ఈ సినిమా అన్ని రకాలుగా ప్రేక్షకులు అంచనాలని అందుకుంది. ఒక మంచి కథ ఉన్న సినిమా చూడాలి, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలి అనుకుని ఆసక్తిగా థియేటర్లకి వెళ్ళిన ప్రేక్షకులని కార్తికేయ 2 అస్సలు నిరాశపరచదు.


You may also like