Ads
డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలని చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నిఖిల్. గత సంవత్సరం కార్తికేయ సినిమా సీక్వెల్ అయిన కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ కొట్టారు. ఇప్పుడు స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : స్పై
- నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్.
- నిర్మాత : కె రాజశేఖర్ రెడ్డి
- దర్శకత్వం : గ్యారీ BH
- సంగీతం : విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల
- విడుదల తేదీ : జూన్ 29, 2023
స్టోరీ :
సినిమా అంతా మూడు విషయాలు చుట్టూ తిరుగుతుంది. జై (నిఖిల్) ఒక ఏజెంట్. ఖాదిర్ ఖాన్ అనే ఒక నేరస్తుడిని పట్టుకునే మిషన్ మీద తిరుగుతూ ఉంటాడు. జై కి ఇదే కాకుండా ఇంకో రెండు విషయాలు పరిష్కరించాల్సి ఉంటుంది. అందులో మొదటిది తన అన్న సుభాష్ (ఆర్యన్ రాజేష్) ని ఎవరు చంపారు అనేది తెలుసుకోవాలి.
మరొకటి సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన ఒక ఫైల్ మిస్ అవుతుంది. అది కనిపెట్టాలి. అసలు ఇవన్నీ చేసింది ఎవరు? ఆ నేరస్తుడిని పట్టుకున్నాడా? జై ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వీటన్నిటి సమాధానాలు ఎలా కనుక్కున్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సాధారణంగా స్పై సినిమాలు అంటే కచ్చితంగా గట్టి స్టోరీ ఉన్న సినిమాలు అని ఒక నమ్మకం ఉంటుంది. అందుకనే ఇలాంటి జానర్ కి చెందిన సినిమా వస్తుంటే ప్రేక్షకులు ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. గత కొంత కాలం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేస్తూ వస్తున్నారు నిఖిల్. నిఖిల్ ఎంచుకుంటున్న ఇలాంటి కాన్సెప్ట్స్ కి ప్రేక్షకులు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. దాంతో ఇప్పుడు నిఖిల్ ఒక స్పై మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
సినిమా చూస్తున్నంత సేపు కూడా ఒక మంచి స్పై మూవీ చూస్తున్నాం అన్న ఫీల్ రాదు. అందుకు కారణం కథనం. ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ అది కేవలం ఒక్క పాయింట్ మీద మాత్రమే ఉండి ఉంటే, ఆ పాయింట్ గురించి ఇంకా బాగా చూపించి ఉంటే సినిమా ఇంకొక రకంగా ఉండేదేమో. ఇలా ఇన్ని సమస్యలు పెట్టేసి, హీరో అవన్నీ ఎలా పరిష్కరించాడు అనేది చూపించాలి అని చేసిన ప్రయత్నం మాత్రం అంత పెద్దగా ఆకట్టుకోదు. ఏదో మిస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు. నిఖిల్ లుక్ అదంతా బాగుంది కానీ నటన పరంగా మాత్రం ఇలాంటి నటనలో నిఖిల్ ని అంతకుముందు మనం చూసాం అనిపిస్తుంది. హీరోయిన్ ఐశ్వర్య కూడా తెలుగులో తనకి మొదటి సినిమా అయినా బానే నటించారు. టెక్నికల్ గా సినిమా బాగుంది. సినిమాటోగ్రఫీ అయితే చాలా స్టైలిష్ గా ఉంది. కానీ అసలు ఇలాంటి సినిమాలకి ముఖ్యమైనది కథ. ఆ విషయంలోనే సినిమా చాలా బలహీనంగా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నిర్మాణ విలువలు
- కొన్ని యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్:
- బలహీనమైన కథనం
- తెలిసిపోయే స్టోరీ
రేటింగ్ :
2.5 / 5
ట్యాగ్ లైన్ :
సాధారణంగానే ఒక కొత్త సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులకు ఎక్కడో కొంత వరకు అంచనాలు ఉంటాయి. అలాంటిది ఇలాంటి స్పై సినిమాలు అంటే ఆ అంచనాలు ఇంకా ఎక్కువగానే ఉంటాయి. కానీ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఏదో అసలు సినిమా ఎలా ఉంటుంది అని చూద్దాం అనుకుంటే మాత్రం స్పై ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
End of Article