‘లాల్ సలామ్’ సినిమాలో రజినీకాంత్ భార్యగా నటించిన ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తుపట్టారా.?

‘లాల్ సలామ్’ సినిమాలో రజినీకాంత్ భార్యగా నటించిన ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తుపట్టారా.?

by Harika

Ads

సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకురాలిగా మారి తన తండ్రి తో లాల్ సలాం సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. లైకా నిర్మాణ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ మొయినుద్దీన్ బాయ్ గా కనిపించాడు. అలాగే ఈ సినిమాలో లెజెండరీ క్రికెట్ ర్ కపిల్ దేవ్ మొదటిసారిగా వెండితెరపై కనిపించబోతున్నాడు. అయితే లాల్ సలాం సినిమాలో రజనీకాంత్ సరసన ఆయన భార్యగా నటించిన నిరోషా గత తరం వారికి గుర్తుండే ఉంటుంది.

Video Advertisement

అయితే ఈ తరం వారికి ఆమె పెద్దగా పరిచయం ఉండి ఉండదు. అయితే ఈమె ఒకప్పుడు తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొంది. కన్నడ, మలయాళం లో కూడా పలు సినిమాలు చేసింది. తెలుగులో నారి నారి నడుమ మురారి, కొబ్బరిబోండం, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, సింధూరపువ్వు వంటి హిట్ సినిమాలలో నటించింది. ఈమె ప్రముఖ నటి రాధిక కి స్వయంగా చెల్లెలు.

సింధూరపువ్వు సినిమా అప్పట్లో ఒక సెన్సేషనల్ హిట్ సాధించిన మూవీ. అందులో ఈమె నటన విమర్శకులను సైతం ఆకట్టుకుంది.అయితే మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ తమిళ్ లో తెరపై ఏంట్రీ ఇచ్చిన లాల్ సలాం సినిమాలో రజనీకాంత్ భార్యగా విక్రాంత్ కి తల్లిగా నటించి మెప్పించింది. రజనీకాంత్ తో పని చేసిన అనుభవం గురించి లాల్ సలాం సినిమా గురించి పలు ఫోటోలని, హ్యాపీ మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

అయితే లాల్ సలాం సినిమా ఫిబ్రవరి 9న తెలుగు తమిళ వెర్షన్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. పూర్తిగా తమిళ్ ఫ్లేవర్ ఉండటంతో తెలుగు ప్రేక్షకులు అంతగా జీర్ణించుకోలేకపోయారు. తమిళంలో కూడా రజనీకాంత్ హవా మీద మాత్రమే నడుస్తుంది. ఇంకా ఈ సినిమాలో జీవిత రాజశేఖర్ కూడా నటిస్తున్నారు ఇందులో ఆమె రజినీకాంత్ సోదరిగా నటిస్తూ ఉండడం విశేషం.


End of Article

You may also like