“కార్తీకదీపం” లో తన పాత్ర గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన “డాక్టర్ బాబు”..! ఇంతకీ ఏమన్నారంటే.?

“కార్తీకదీపం” లో తన పాత్ర గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన “డాక్టర్ బాబు”..! ఇంతకీ ఏమన్నారంటే.?

by Mohana Priya

Ads

ప్రస్తుతం టాప్ సీరియల్ ఏది అంటే అందరూ ఆలోచించకుండా చెప్పే సమాధానం కార్తీకదీపం. గత మూడు నాలుగు సంవత్సరాలుగా వస్తున్న ఈ సీరియల్ తెలుగు సీరియల్స్ లో టాప్ గా నిలిచింది. ఒక వేళ సీరియల్స్ లో కూడా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లాంటివి ఏమైనా ఉంటే ఈ సీరియల్ మాత్రం బ్లాక్ బస్టర్ కేటగిరీ లోకి వస్తుంది. ఈ సీరియల్ లో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి కార్తీక్ పాత్ర పోషిస్తున్న నిరుపమ్ పరిటాల.

Video Advertisement

nirupam 2

ఈ సీరియల్ లో కార్తీక్ పాత్ర ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు నిరుపమ్. అయితే నిరుపమ్ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన పాత్ర గురించి, సీరియల్ గురించి, అలాగే సీరియల్ లో నటించే నటీనటుల గురించి, ఇవి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు గురించి కూడా మాట్లాడారు.

అయితే, ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రని ఎంత ఎమోషనల్ గా చూపిస్తున్నారో మనందరికీ తెలుసు. ఈ విషయంపై నిరుపమ్ స్పందిస్తూ, తన పాత్రకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని ఊహించలేదు అని, మగవాళ్ళు ఏడవడం వల్ల సీరియల్ పై ఇంత అభిమానం పెంచుకుంటారు అని తను అనుకోలేదు అని చెప్పారు.

అంతే కాకుండా సీరియల్ లో ప్రేమి విశ్వనాథ్ తో తనకి చాలా మంచి స్నేహం ఉంది అని, ఈ సీరియల్ ని తన ఇంట్లో వాళ్ళు కూడా ఫాలో అవుతారు అని, సీరియల్ ని  సీరియల్ గా మాత్రమే చూస్తారు అని చెప్పారు. అంతే కాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ కొంత మందిని నమ్మి మోసపోయినట్టు కూడా చెప్పారు నిరుపమ్.

watch video : 


End of Article

You may also like