ప్రస్తుతం టాప్ సీరియల్ ఏది అంటే అందరూ ఆలోచించకుండా చెప్పే సమాధానం కార్తీకదీపం. గత మూడు నాలుగు సంవత్సరాలుగా వస్తున్న ఈ సీరియల్ తెలుగు సీరియల్స్ లో టాప్ గా నిలిచింది. ఒక వేళ సీరియల్స్ లో కూడా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లాంటివి ఏమైనా ఉంటే ఈ సీరియల్ మాత్రం బ్లాక్ బస్టర్ కేటగిరీ లోకి వస్తుంది. ఈ సీరియల్ లో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి కార్తీక్ పాత్ర పోషిస్తున్న నిరుపమ్ పరిటాల. ఈ సీరియల్ లో కార్తీక్ పాత్ర ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు నిరుపమ్.

nirupam manjula

మంజుల ఇటీవల యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. అందులో తన భర్తని నిరుపమ్ కి బర్త్ డే పార్టీ నిర్వహించి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇదే విధంగా నిరుపమ్ కూడా మంజులకి ఇచ్చారు. నిరుపమ్ తన భార్య మంజులకి కార్ కొనిచ్చారు. ఈ విషయంపై మంజుల మాట్లాడుతూ ఎప్పుడూ తనే సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను అని, మొదటిసారి తన కోసం నిరుపమ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అని, ఇలా నిరుపమ్ సర్ప్రైజ్ ఇవ్వడం ఇదే మొదటిసారి అన్నారు.

watch video :