శబరిమల చరిత్రలో తొలిసారి ఇలా…ఆలయంలోకి ప్రవేశించిన ఈ ట్రాన్స్‌జెండర్ ఎవరంటే.?

శబరిమల చరిత్రలో తొలిసారి ఇలా…ఆలయంలోకి ప్రవేశించిన ఈ ట్రాన్స్‌జెండర్ ఎవరంటే.?

by Mohana Priya

Ads

ప్రతి సంవత్సరం ఎంతో మంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్తారు. అక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. దేశం నలుమూలల నుండి ఎంతో మంది భక్తులు శబరిమలకి తరలి వెళ్తూ ఉంటారు. అందుకే శబరిమల ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.

Video Advertisement

ఎన్నో శతాబ్దాల నుండి ఈ పద్ధతి అనేది కొనసాగుతూ వస్తోంది. అయితే శబరిమల ఆలయంలోకి 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ప్రవేశించకూడదు అనే ఒక నియమం కూడా ఉంది. కానీ ఈ సారి మాత్రం ఒక ట్రాన్స్‌జెండర్ శబరిమలలోకి ప్రవేశించారు.

nisha kranti shabarimala incident

ప్రతి సంవత్సరం నవంబర్ లో అయ్యప్ప స్వామి మాలని ధరించి సంక్రాంతి సమయంలో శబరిమలకి వెళ్లి అయ్యప్ప స్వామి దర్శించుకుంటారు. ఈ సారి జోగిని ట్రాన్స్‌జెండర్ నిషా క్రాంతి శబరిమలకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. నిషా క్రాంతి నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో పూజల్లో పాల్గొన్నారు. నిషా క్రాంతి జోగిని నిషా క్రాంతి పేరుతో ప్రఖ్యాతి చెందారు.

nisha kranti shabarimala incident

రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగే బ్రహ్మోత్సవ వేడుకల్లో నిషా క్రాంతి పాల్గొంటారు. ఇప్పుడు ఆదివారం శబరిమలకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆడవాళ్లు శబరిమలకి వెళ్లడం మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయ్యప్ప స్వామి ఆజన్మ బ్రహ్మచారి అని, ఈ కారణం చేత 10 సంవత్సరాల వయసు నుండి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు గుడిలోకి అడుగు పెట్టకూడదు అనే నియమాన్ని ఎన్నో సంవత్సరాలలో నుండి పాటిస్తున్నారు.

nisha kranti shabarimala incident

ఈ విషయం మీద 2019 లో గొడవలు కూడా జరిగాయి. ఆడవాళ్ళని శబరిమలలోకి అనుమతించాలి అంటూ ఎంతో మంది వాదించారు. కానీ ఇప్పుడు నిషా క్రాంతి శబరిమల కి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. నిషా క్రాంతికి కేరళ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ ఐడి ఆధారంగా అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో అయ్యప్ప స్వామి గుడిలోకి అడుగు పెట్టిన మొదటి ట్రాన్స్‌జెండర్ గా నిషా క్రాంతి చరిత్రలో నిలిచారు.

ALSO READ : మీ పూజ గదిలో ఒకటికంటే ఎక్కువ గణేష్ విగ్రహాలున్నాయా..? అలా అస్సలు ఉంచకండి.. ఎందుకంటే..?


End of Article

You may also like