Ads
- చిత్రం : నిశ్శబ్దం
- నటీనటులు :అనుష్క శెట్టి, మాధవన్, సుబ్బరాజు, షాలిని పాండే, అంజలి, శ్రీనివాస్ అవసరాల, మైకేల్ మాడ్సెన్.
- నిర్మాత : కోన వెంకట్
- దర్శకత్వం : హేమంత్ మధుకర్
- సంగీతం : గోపీసుందర్, గిరీష్ జి
- విడుదల తేదీ : అక్టోబర్ 2, 2020 (అమెజాన్ ప్రైమ్)
Video Advertisement
కథ :
ట్రైలర్ చూసిన వాళ్లకి సినిమా ఏ జోనర్ కి చెందినది అనే విషయం ఈ పాటికి అర్థం అయ్యే ఉంటుంది. అందుకే కథ గురించి సింపుల్ గా మాట్లాడుకుందాం. ఒక హాంటెడ్ విల్లా ఉంటుంది. అందులో జరిగిన ఒక ఘటన లో సాక్షి (అనుష్క) కి సంబంధం ఉంటుంది. సాక్షి ఒక పెయింటర్. సాక్షి ఇంకా అంటోని (మాధవన్) ప్రేమించుకుంటారు. వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సాక్షి కి క్లోజ్ అయిన సోనాలి (షాలిని పాండే) కనిపించకుండా పోతుంది. సోనాలి ఎక్కడికి వెళ్లింది? వివేక్ (సుబ్బరాజు) కి ఈ కథకి సంబంధం ఏంటి? హాంటెడ్ విల్లా లో జరిగిన ఘటన ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న మహా(అంజలి) నిజం తెలుసుకోగలిగిందా? అసలు ఇది హారర్ స్టోరీ యా? లేక థ్రిల్లర్ స్టోరీ యా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
లాక్ డౌన్ మొదలైన తర్వాత డిజిటల్ రిలీజయ్యే సినిమాల జాబితాలో నిశ్శబ్దం పేరు మొదటి నుండి వస్తూనే ఉంది. కానీ కోన వెంకట్ మాత్రం ఈ సినిమా ఓటీటీ లో విడుదల చేయడానికి అసలు సుముఖత చూపలేదు. ఈ సినిమా థియేటర్ లో చూస్తేనే బాగుంటుంది అని చెప్పారు. అందుకే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఉండదు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఓటీటీ లో విడుదల అయ్యింది. నిజంగా ఈ సినిమా థియేటర్ లో చూస్తేనే బాగుండేది. కొన్ని సినిమాలు మనం థియేటర్ లో చూసినప్పుడు బాగుంటాయి కానీ డిజిటల్ ప్లాట్ ఫాం లో చూసినప్పుడు మామూలుగా అనిపిస్తాయి. దానికి కారణం ఆ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసమే చేయబడింది. ఈ సినిమా కూడా అంతే. మనం థియేటర్ లో వదిలేసే చిన్న చిన్న విషయాలు ఇలా ఓటీటీ లో చూస్తున్నప్పుడు పట్టించుకుంటాం. అంతేకాకుండా “నెక్స్ట్ ఏమవుతుంది?” ” విలన్ ఎవరు?” లాంటి సినిమాలు మనం చూశాం. అందుకే ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఏ మెయిన్ క్యారెక్టర్ కనిపించినా ” విలన్ తనేనా?” అని అనుమానం వస్తుంది. అనుష్క పర్ఫామెన్స్ గురించి అసలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనుష్క నటించిన మిగిలిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్ కి ఎక్స్ప్రెషన్స్ చాలా ముఖ్యం. అవే ప్లస్ పాయింట్ కూడా అయ్యాయి.
టీజర్, ట్రైలర్ చూసిన వారికి మాధవన్ గెస్ట్ అప్పియరెన్స్ ఏమో అని అనిపించే అవకాశాలు ఉన్నాయి. సినిమా వాళ్ళు ఒక క్యారెక్టర్ ని టీజర్, ట్రైలర్ లో అంత తక్కువగా చూపించడానికి కారణం, వాళ్ల క్యారెక్టర్ ఈ సినిమాకి అంత ఇంపార్టెంట్ అని. అంత ఇంపార్టెంట్ రోల్ లో అంతే బాగా పర్ఫార్మ్ చేశారు మాధవన్. సుబ్బరాజు కి మళ్ళీ ఒక మంచి రోల్ లభించింది. షాలిని పాండే క్యారెక్టర్ కూడా మాధవన్ గురించి చెప్పిన కేటగిరీలోకే వస్తుంది. షాలిని పాండే కూడా బాగా నటించారు. మహా గా అంజలి కూడా తన పాత్రకి న్యాయం చేశారు. వీళ్లందరితో పాటు మైకేల్ మాడ్సెన్ కూడా సినిమాకి ఒక డిఫరెంట్ టచ్ యాడ్ చేశారు.
సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమా కి సెట్ అయ్యే లాగా ఉన్నాయి. ఇంక సినిమాలో ట్విస్టుల విషయానికొస్తే పైన చెప్పినట్టుగా అందరం ఇలాంటి జోనర్ సినిమాలు చూసే ఉన్నాం. కాబట్టి కొంత మందికి ట్విస్టులు ముందే అర్థం అవ్వచ్చు. కొంత మంది మాత్రం సమయం పడుతూ ఉండొచ్చు. క్లైమాక్స్ మాత్రం కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. సింపుల్ స్టోరీ అయినా కూడా ప్రజెంటేషన్ విషయంలో దర్శకుడు హేమంత్ మధుకర్ కి మంచి మార్కులు పడతాయి. షనీల్ డియో సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సియాటిల్ ని తన కెమెరా పనితనంతో చాలా బాగా చూపించారు.
ప్లస్ పాయింట్స్ :
అనుష్క శెట్టి, మిగిలిన ముఖ్య నటీనటుల యాక్టింగ్
లొకేషన్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడా తెలిసిపోయే ట్విస్టులు
కొంచెం డ్రాగ్ చేసిన క్లైమాక్స్
రేటింగ్ : 3.5 / 5
ట్యాగ్ లైన్ :
ఇటు చాలా బాగుంది అని చెప్పలేం. అలా అని అస్సలు బాలేదు అని కూడా చెప్పలేం. అన్ని కరెక్ట్ గా సినిమా కి తగ్గట్టుగా ఉన్నాయి. ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు నచ్చడం, నచ్చకపోవడం అనే ఒపీనియన్ ఆ ప్రేక్షకుడు అంతకుముందు ఈ జోనర్ కి సంబంధించిన సినిమాలు ఎన్ని చూశారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ ఎవరైనా సరే ఒక్కసారి మాత్రం తప్పకుండా చూడొచ్చు. ఇందాక చెప్పినట్టుగా అన్ని ఎలిమెంట్స్ సినిమా కి తగ్గట్టుగా కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి సినిమా చూసే ప్రేక్షకులకి నిశ్శబ్దం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
End of Article