ఏంటి నితిన్ మొన్నేమో అలా అన్నావ్…ఇప్పుడు భార్య గురించి ఇలా పోస్ట్ చేసావ్?

ఏంటి నితిన్ మొన్నేమో అలా అన్నావ్…ఇప్పుడు భార్య గురించి ఇలా పోస్ట్ చేసావ్?

by Megha Varna

Ads

నితిన్‌ కల్యాణానికి ముహూర్తం కుదిరింది. దుబాయ్ వేదికగా పెళ్లి జరగనుంది. ఇప్పుడు నితిన్‌ చేస్తున్న ‘భీష్మ’ సినిమా ట్యాగ్‌లైన్‌ ‘ది బ్యాచ్‌లర్‌’. అయితే నితిన్‌ బ్యాచ్‌లర్‌ లైఫ్‌కి ఫుల్‌స్టాప్‌ పడబోతోంది. పెళ్లి పనులు స్టార్టడ్, మ్యూజిక్ స్టార్ట్స్ అని ట్విట్టర్ లో ట్వీట్ చేసి నిశ్చితార్థం ఫోటోలు పంచుకున్నాడు నితిన్. పెళ్లి పనులు స్టార్టడ్ అని కూడా అన్నాడు. ఈ పోస్ట్ కి ఎంతో మంది సెలబ్రిటీస్ రిప్లైలు కూడా ఇచ్చారు, కంగ్రాట్స్ తెలిపారు.

Video Advertisement

ఇది ఇలా ఉండగా.. నితిన్, రష్మిక జంటగా నటించిన భీష్మ త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలు ప్రజాధారణ పొందాయి. ఇక అసలు విషయానికి వస్తే…మొన్నేమో నితిన్ భీష్మ సినిమాలోని “సింగిల్స్ ” సాంగ్ షేర్ చేసి ఫరెవర్ సింగల్ అన్నాడు. నిన్నేమో పెళ్లి పనులు స్టార్టడ్ అని పోస్ట్ చేసాడు. దీనిపై నెటిజెన్స్ ఫన్నీ ట్రోల్ల్స్ చేస్తున్నారు. అప్పుడు సింగల్ బెస్ట్ అని ఇప్పుడు పెళ్లి పనులు స్టార్టడ్ అంటావా అంటూ సరదా ఛలోక్తులు విసురుతున్నారు.

దుబాయ్‌లోని పలాజో వెర్సాసె‌లో ఏప్రిల్ 15 వ తేదీన నితిన్ వివాహ వేడుక జరగనుంది.
ఏప్రిల్ 16వ తేదీన రిసెప్షన్ నిర్వహించనున్నట్టు తెలిసింది. ఇది ఇలా ఉండగా…వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న భీష్మ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకి రానుంది. నితిన్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్నారు. మరి అటు సినిమా ఇటు లైఫ్ రెండు సక్సెస్ అవ్వాలని నితిన్ కి విషెస్ తెలుపుదాం.


End of Article

You may also like