NITHIN EXTRA ORDINARY MAN FIRST REVIEW: “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” ఫస్ట్ రివ్యూ వచ్చేసింది… సినిమా ఎలా ఉందంటే.?

NITHIN EXTRA ORDINARY MAN FIRST REVIEW: “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” ఫస్ట్ రివ్యూ వచ్చేసింది… సినిమా ఎలా ఉందంటే.?

by Mounika Singaluri

Ads

యంగ్ హీరో నితిన్ కి హిట్టు వచ్చి చాలా రోజులైంది. అతను నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ఎక్కడ కాన్ఫిడెన్స్ తగ్గకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా నితిన్ నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రం డిసెంబర్ 8వ తారీఖున విడుదల కానుంది. ఈ చిత్రాన్ని వక్కంతం వంశీ డైరెక్ట్ చేశారు.వక్కంతం వంశీకి ఇది రెండవ చిత్రం. వంశీ డైరెక్ట్ చేసిన మొదటి చిత్రం అల్లు అర్జున్ నా పేరు సూర్య ఫ్లాప్ గా మిగిలింది. చాలా రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Video Advertisement

ఈ చిత్రంలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రంలో రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని నితిన్ హోమ్ బ్యానర్ నిర్మించింది. యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హరీస్ జయరాజ్ అందించిన పాటలు ప్రేక్షకులు ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రమోషన్స్ బాగానే చేస్తున్న చిత్రం మీద హైప్ తీసుకురావడంలో మూవీ టీం వెనకబడింది.

అయితే ఈ చిత్రాన్ని తాజాగా ఇండస్ట్రీలో ఉన్న కొద్ది మందికి ప్రీమియర్స్ వేశారట. ఫస్ట్ ఆఫ్ ఎక్స్ట్రార్డినరీగా ఎంటర్టైనింగ్ గా ఉందని టాక్. అయితే సెకండ్ హాఫ్ లో కొద్దిగా బోర్ కొట్టే సన్నివేశాలు ఉన్నాయని మళ్ళీ ఫ్రీ క్లైమాక్స్,క్లైమాక్స్ అద్భుతంగా వచ్చాయని అంటున్నారు. దీంతో నితిన్ ఈసారి హిట్ కొట్టినట్టే అని చెబుతున్నారు. ఈ చిత్రానికి ఫస్ట్ రివ్యూ పాజిటివ్ గా రావడంతో మూవీ టీం కాన్ఫిడెంట్ గా ఉన్నారట. నితిన్ కూడా ఈ సినిమాని చాలా కసిగా ప్రమోట్ చేస్తున్నారు.

అందులోనూ ఇప్పుడు యానిమల్ ఫీవర్ నడుస్తుంది. దానికి తోడు నాని నటించిన హాయ్ నాన్న మూవీ కూడా ఒకరోజు ముందు విడుదలయ్యి మంచి టాక్ సంపాదించుకుంది. ఇలాంటి టైంలో నితిన్ తన సినిమాను ముందుకు తీసుకొస్తున్నారు. ఏది ఏమైనా తక్కువ అంచనాల మధ్య విడుదలై మంచి హిట్ సాధిస్తే ఈ సినిమాకి కలిసొస్తుంది. ఏది ఏమైనా ఈ సినిమాతో నితిన్ హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఆశిద్దాం.


End of Article

You may also like