నితిన్ పెళ్ళికి కొత్త ట్విస్ట్…! వాయిదా పడనుందా..? అసలు కారణం ఇదే..!

నితిన్ పెళ్ళికి కొత్త ట్విస్ట్…! వాయిదా పడనుందా..? అసలు కారణం ఇదే..!

by Sainath Gopi

Ads

నితిన్‌ కల్యాణానికి ముహూర్తం కుదిరింది. దుబాయ్ వేదికగా పెళ్లి జరగనుంది.పెళ్లి పనులు స్టార్టడ్, మ్యూజిక్ స్టార్ట్స్ అని ట్విట్టర్ లో ట్వీట్ చేసి నిశ్చితార్థం ఫోటోలు పంచుకున్నాడు నితిన్.ఆ పోస్ట్ కి ఎంతో మంది సెలబ్రిటీస్ రిప్లైలు కూడా ఇచ్చారు, కంగ్రాట్స్ తెలిపారు.

Video Advertisement

దుబాయ్‌లోని పలాజో వెర్సాసె‌లో ఏప్రిల్ 15 వ తేదీన నితిన్ వివాహ వేడుక జరగనుంది. ఏప్రిల్ 16వ తేదీన రిసెప్షన్ నిర్వహించనున్నట్టు తెలిసింది. అయితే ఇప్పుడు ఈ వేడుకపై కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావం విదేశాల్లో ఎక్కువగా ఉండడంతో నితిన్ పెళ్లి పైన పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పెళ్లి డేట్ వరకు కరోనా కంట్రోల్ లోకి వస్తే ఇబ్బంది లేదు. లేకపోతే హైదరాబాద్‌లో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగర శివారులోని ఓ ఫార్మ్ హౌస్ పెళ్లి జరపడానికి సిద్ధం అవుతున్నారంట వధూవరుల కుటుంబాలు. ఇక పెళ్లి అనంతరం సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఏప్రిల్‌ 21న హైటెక్స్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారు.

తాజాగా నితిన్ రష్మిక జంటగా నటించిన భీష్మ చిత్రం హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. అటు కెరీర్ లో ఇటు లైఫ్ లో నితిన్ కి మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి అనుకుంటే…పెళ్లిపై ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ పడింది. దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇక షాలిని గారి విషయానికి వస్తే….ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కందుకూరులో 1989 సెప్టెంబర్ 27న షాలిని జన్మించారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్లు. షాలిని చిన్నతనంలోనే కుటుంబం హైదరాబాద్‌ వచ్చేసింది. సెయింట్ మేరీస్ హైస్కూల్‌లో చదివి తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం లండన్ వెళ్లిపోయారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం ఒక ఎమ్.ఎన్.సి లో హెచ్‌ఆర్‌ గా చేస్తున్నారు.

నితిన్ షాలిని నాలుగు సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని నితిన్ చాలా సీక్రెట్‌గా ఉంచారు.మొదట నితిన్ కి పెళ్లి కుదిరింది అని వార్త రాగానే అందరు పెద్దలు కుదిరిచ్చిన పెళ్లి అనుకున్నారు. ఆయనే స్వయంగా లవ్ మ్యారేజ్ అని చెప్పేసరికి అందరు ఒక్కసారిగా అవాక్కయ్యారు.


End of Article

You may also like