బిల్లు కట్టడానికి డబ్బులు లేవు… చివరికి..? కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!

బిల్లు కట్టడానికి డబ్బులు లేవు… చివరికి..? కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!

by kavitha

Ads

ప్రస్తుత కాలంలో వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న  విషయం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న జబ్బు అయిన చికిత్స చేయించడానికి వేలలో ఖర్చవుతుంది. ఇక జబ్బు పెద్దది అయితే ట్రీట్మెంట్ కి ప్రైవేటు హాస్పటల్స్ లో లక్షల్లో బిల్ వేస్తున్నారు.

Video Advertisement

హైదరాబాద్ ఐఎస్ సదన్ ప్రాంతంలో రోజుల పాపను వైద్యం కోసం ఒక కార్పొరేట్ హాస్పిటల్‌ లో అడ్మిట్ చేశారు. బిల్లు వారు కట్టలేనంతగా ఉండడంతో బిల్లు కట్టే స్థోమత లేక తమ బిడ్డను ఆస్పత్రిలోనే వదలేసి వచ్చిన జంట, గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్‌ లోని ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ సింగరేణి కాలనీకి చెందిన నితిన్, ప్రవల్లికలు సంవత్సరం క్రితం ప్రేమ  పెళ్లి చేసుకుని, ఆ కాలనీలో జీవిస్తున్నారు. నితిన్‌ ఆటో నడుపుతూ ప్రవల్లికను పోషిస్తున్నాడు. ఈ జంటకు సెప్టెంబర్ 7న పాప జన్మించింది. అయితే పుట్టిన వెంటనే ఆ పాపకు అనారోగ్య సమస్యలు రావడంతో నిలోఫర్‌ హస్పటల్ లో జాయిన్ చేశారు. వెంటిలేటర్‌ పై ఉంచి పాపకు చికిత్స అందించారు.
పాప ఆరోగ్యం బాగుపడడంతో ఇంటికి పంపించారు. అయితే ఇంటికి వెళ్ళిన తరువాత పాప శరీరంలో మార్పు రావటంతో తల్లిదండ్రులు వెంటనే  స్థానిక డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లారు. పాపను పరిశీలించిన డాక్టర్, చికిత్స అవసరమని ప్రైవేటు హాస్పటల్ కు తీసుకువెళ్లాలని చెప్పడంతో పాపను పిసల్‌బండలోని ఒక ప్రైవేటు హాస్పటల్ కి  తీసుకెళ్లారు. ఆ హాస్పటల్ లో జాయిన్ చేసుకున్న వైద్యులు పాపకు మెరుగైన చికిత్సను అందించారు.  ఏడురోజుల చికిత్స తరువాత పాప కోలుకుంది.
వైద్యానికి లక్షా 16 వేల రూపాయల బిల్లు వేశారు. కానీ వారి దగ్గర 35 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ నిరుపేద దంపతులు దగ్గర ఉన్న రూ.35 వేలు హాస్పటల్ చెల్లించారు. మిగతా డబ్బు సర్దుబాటు అవకపోవడంతో బిల్లు కట్టలేక పాపను హస్పటల్ లోనే వదిలేసి వచ్చారు. మంగళవారం నాడు సేవాలాల్‌ బంజారా సంఘం ఆఫీస్ లో ఆ జంట  మీడియాతో మాట్లాడుతూ తమ బాధను చెప్పుకున్నారు. సంఘం ప్రెసిడెంట్ కొర్ర మోతీలాల్‌ నాయక్‌ మాట్లాడుతూ, ఎవరైనా దాతలు ఈ నిరుపేద ఫ్యామిలీకి హాస్పటల్ బిల్లు కట్టేందుకు సహాయం చేయమని కోరారు.

Also Read: నిండా 6 సంవత్సరాలు… ఏం జరిగిందో కూడా తెలియదు..! కానీ ఇంతలోనే..?


End of Article

You may also like