నితిన్ కి కాబోయే భార్య షాలిని గురించి ఈ విషయాలు మీకు తెలుసా? లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది అంటే?

నితిన్ కి కాబోయే భార్య షాలిని గురించి ఈ విషయాలు మీకు తెలుసా? లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది అంటే?

by Megha Varna

Ads

నితిన్‌ కల్యాణానికి ముహూర్తం కుదిరింది. దుబాయ్ వేదికగా పెళ్లి జరగనుంది. ఇప్పుడు నితిన్‌ చేస్తున్న ‘భీష్మ’ సినిమా ట్యాగ్‌లైన్‌ ‘ది బ్యాచ్‌లర్‌’. అయితే నితిన్‌ బ్యాచ్‌లర్‌ లైఫ్‌కి ఫుల్‌స్టాప్‌ పడబోతోంది. పెళ్లి పనులు స్టార్టడ్, మ్యూజిక్ స్టార్ట్స్ అని ట్విట్టర్ లో ట్వీట్ చేసి నిశ్చితార్థం ఫోటోలు పంచుకున్నాడు నితిన్.ఈ పోస్ట్ కి ఎంతో మంది సెలబ్రిటీస్ రిప్లైలు కూడా ఇచ్చారు, కంగ్రాట్స్ తెలిపారు.

Video Advertisement

ఇది ఇలా ఉండగా…నితిన్ కి కాబోయే భార్య గురించి తెలుసుకోడానికి నెటిజెన్లు ఎంతో సెర్చ్ చేస్తున్నారు. మరి షాలిని గురించి తెలుసుకుందాము రండి. ‘ఇష్క్‌’ (2012) సినిమా జరుగుతున్న సమయంలో కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా నితిన్ షాలిని కలుసుకున్నారు. చూడగానే నా మనసుకు తను బాగా నచ్చింది. ముందు ఫ్రెండ్స్‌లానే ఉన్నాం. కొంత సమయం తరవాత ఒకరినొకరు అర్థం చేసుకున్నాక నెక్ట్స్‌ స్టెప్‌ తీసుకున్నాం. గత ఏడాది ఇంట్లోవాళ్లకు చెప్పాం. ఇంట్లోవారికి చెప్పగానే రెండు కుటుంబాలవారు ఎటువంటి అభ్యంతరం లేకుండా అంగీకరించారు అంటూ ఓ ఇంటర్వ్యూలో నితిన్ తెలిపారు.

ఇక షాలిని గారి విషయానికి వస్తే….ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కందుకూరులో 1989 సెప్టెంబర్ 27న షాలిని జన్మించారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్లు. షాలిని చిన్నతనంలోనే కుటుంబం హైదరాబాద్‌ వచ్చేసింది. సెయింట్ మేరీస్ హైస్కూల్‌లో చదివి తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం లండన్ వెళ్లిపోయారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం ఒక ఎమ్.ఎన్.సి లో హెచ్‌ఆర్‌ గా చేస్తున్నారు.

నితిన్ షాలిని నాలుగు సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని నితిన్ చాలా సీక్రెట్‌గా ఉంచారు.మొదట నితిన్ కి పెళ్లి కుదిరింది అని వార్త రాగానే అందరు పెద్దలు కుదిరిచ్చిన పెళ్లి అనుకున్నారు. ఆయనే స్వయంగా లవ్ మ్యారేజ్ అని చెప్పేసరికి అందరు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

దుబాయ్‌లోని పలాజో వెర్సాసె‌లో ఏప్రిల్ 15 వ తేదీన నితిన్ వివాహ వేడుక జరగనుంది. ఏప్రిల్ 16వ తేదీన రిసెప్షన్ నిర్వహించనున్నట్టు తెలిసింది. ఇది ఇలా ఉండగా…వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న భీష్మ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకి రానుంది. నితిన్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్నారు. మరి అటు సినిమా ఇటు లైఫ్ రెండు సక్సెస్ అవ్వాలని నితిన్ కి విషెస్ తెలుపుదాం.


End of Article

You may also like