Home Filmy Adda బాలయ్య పాటకి నాని హీరోయిన్ డాన్స్..! వీడియో వైరల్..!

బాలయ్య పాటకి నాని హీరోయిన్ డాన్స్..! వీడియో వైరల్..!

by Mohana Priya

సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా అఖండ. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ. రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అఖండ మొదటి షో అయిన తర్వాత నుండే హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాతో వారిద్దరు హ్యాట్రిక్ విజయం సాధించారు అని అంటున్నారు.

nivetha thomas dance for jai balayya song goes viral

ఇందులో ముఖ్యంగా పాటలు సినిమాకి ఒక హైలైట్ గా నిలిచాయి. జై బాలయ్య పాటకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో హుక్ స్టెప్ మీద డాన్స్ చేస్తూ చాలా మంది సోషల్ మీడియాలో వీడియోస్ షేర్ చేసారు. ఇప్పుడు హీరోయిన్ నివేత థామస్ కూడా ఆ స్టెప్ చేస్తూ వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

 

watch video :

https://www.instagram.com/reel/CYDtw7bpLTO/?utm_source=ig_web_copy_link

You may also like