Ads
- చిత్రం : శాకిని డాకిని
- నటీనటులు : నివేతా థామస్, రెజీనా కసాండ్రా.
- నిర్మాత : డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్వూ థామస్ కిమ్
- దర్శకత్వం : సుధీర్ వర్మ
- సంగీతం : మైకీ మెక్‌క్లియరీ
- విడుదల తేదీ : సెప్టెంబర్ 16, 2022
Video Advertisement
స్టోరీ :
షాలిని (నివేతా థామస్), దామిని (రెజీనా కసాండ్రా) ఇద్దరు పోలీస్ ట్రైనింగ్ కోసం అకాడమీలో చేరుతారు. ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి. ప్రతి చిన్న విషయానికి గొడవలు పడతారు. వారిద్దరూ ఒక రోజు అర్ధరాత్రి సమయంలో ఒక అమ్మాయి కిడ్నాప్ అవ్వడం చూస్తారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా కూడా వారు మరొక కేస్ విషయంలో బిజీగా ఉంటారు. దాంతో వీరిద్దరూ అనధికారంగా ఈ కిడ్నాప్ కేస్ చేపడతారు. ఈ కిడ్నాప్ వెనకాల ఉన్నది ఎవరు? చివరికి షాలిని, దామిని ఈ కేస్ ఎలా పరిష్కరించారు? కిడ్నాప్ అయిన అమ్మాయిని కాపాడారా? వీరిద్దరూ స్నేహితులు అయ్యారా? ఇదంతా తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సాధారణంగా తెలుగులో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు రావడం చాలా తక్కువ. అది కూడా ఇద్దరు హీరోయిన్లు నటించిన సినిమాలు అయితే ఇంకా తక్కువ. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా వచ్చింది. ఈ సినిమా కొరియన్ సినిమా మిడ్ నైట్ రన్నర్స్ రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశారు. సినిమా చాలా వరకు కామెడీగా సాగుతుంది. యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి.
కానీ రీమేక్ చేసే ప్రాసెస్ లో ఎక్కడో కొన్ని లాజిక్ లు మిస్ అయ్యాయి ఏమో అనిపిస్తుంది. అసలు హీరోయిన్లు పోలీస్ అకాడమీకి ఎందుకు వెళ్తారు అనే విషయాన్ని మనకి స్పష్టంగా చూపించరు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇద్దరు హీరోయిన్లు పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. వారిద్దరూ ఈ సినిమా కోసం అలాగే ఇందులో ఉన్న యాక్షన్ సన్నివేశాల కోసం చాలా కష్టపడ్డారు. వారి కష్టానికి తగ్గట్టుగానే యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చాయి.
నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. సంగీతం అంత పెద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేదు. పాటలు ఏదో అలా వచ్చి వెళ్లిపోతాయి అంతే. అంత గుర్తుండే పాటలు అయితే లేవు అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని సీన్స్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. చాలా సీన్స్ సాగదీసినట్టు అనిపిస్తాయి. కానీ మొత్తంగా చూస్తే సినిమాలో యాక్షన్ మాత్రం హైలెట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- యాక్షన్ సీన్స్
- నిర్మాణ విలువలు
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- చాలా చోట్ల మిస్ అయిన లాజిక్
- బోరింగ్ గా అనిపించే కొన్ని సీన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
ఒక మంచి విషయాన్ని ఎంటర్టైన్మెంట్ తో చూపించారు. కొన్ని లాజిక్స్ పక్కన పెట్టేస్తే ఒక మంచి కామెడీ సినిమా చూద్దాం అనుకునే వారిని, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమా చూద్దాం అనుకునే వారిని శాకిని డాకిని సినిమా అస్సలు నిరాశపరచదు.
End of Article