పాజిటివ్ కేసులు “జీరో”…కానీ “న్యూజిలాండ్” ని కరోనా ఫ్రీ అనడానికి కండిషన్ ఏంటంటే?

పాజిటివ్ కేసులు “జీరో”…కానీ “న్యూజిలాండ్” ని కరోనా ఫ్రీ అనడానికి కండిషన్ ఏంటంటే?

by Sainath Gopi

Ads

న్యూజిలాండ్…ఇప్పుడు ప్రపంచంలోనే కరొనను జయించిన తొలి దేశం. ప్రపంచంలో అన్ని దేశాల చూపు ఆ దేశంపైనే. ఆ దేశంనుండి చూసి ప్రపంచం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఫిబ్రవరి 28న మొదటి కరోనా కేసు బయటపడింది ఆ దేశంలో. మే 22 తర్వాత ఒక్క కొత్త కేసు కూడా రాలేదు. చివరి పేషెంట్ తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆ దేశం కరోనా ఫ్రీ అయ్యింది. దీంతో లాక్ డౌన్ నిభందనలు కూడా ఎత్తేసారు. అయితే అగ్రరాజ్యాలు సైతం కరోనా మహమ్మారిని ఎదురుకోవడంలో ఇబ్బంది పడుతున్న తరుణంలో న్యూజిలాండ్ ఎలా కరోనా పై విజయం సాధించింది అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అయితే ఆ దేశం విజయం సాధించడానికి కారణం మాత్రం ఆ అమ్మ కృషే.

Video Advertisement

తల్లిలా తన దేశంకోసం శాయశక్తులా పోరాడుతుంది:

ఆమె ఒక చంటి బిడ్డకి తల్లి, ఒక దేశానికి ప్రధాని.. తన బిడ్డకి ఆపద వస్తే ఎలా తల్లడిల్లిపోతుందో ఇప్పుడు తన దేశం కూడా కరోనా కోరల్లో ఉంది.. దేశాన్ని కాపాడడం కోసం తన శాయశక్తులా పోరాడుతుంది.. నేనున్నాను అంటూ భరోసా ఇస్తుంది. తనే జెసిండా ఆర్డర్న్..న్యూజిలాండ్ ప్రధాని .. పోయినేడాది చంటిబిడ్డతో  ఐక్యరాజ్యసమితిలో అడుగుపెట్టిన ఆమె..ఇప్పుడు అదే చంటిబిడ్డ ఆలనాపాలన చూస్తూ అమ్మగా దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

తొలి పాజిటివ్ కేసు నమోదైనప్పటి నుండి:

ఫిబ్రవరి 28 న తొలికేసు నమోదైంది నూజిలాండ్లో..ఇరాన్ నుండి వచ్చిన మహిళగా గుర్తించారు.అ రోజు నుండి విదేశాల నుండి వచ్చినవారిని క్వారంటైన్ కి తరలించాలని, అంతకుకొన్ని రోజుల ముందు విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి వారికి,వారు  నేరుగా కలిసిన వారికి పరీక్షలు జరపాలని ఆదేశాలిచ్చారు జెసిండా. ఒక్కసారిగా యావత్ యంత్రాంగం సిద్దమైంది.

దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు:

కరోనా కేసులు పెరుగుతుండడంతో పద్నాలుగు రోజుల పాటు ఎవరి ఇళ్లకు వారు పరిమితం కావాలని చెప్పారు, జెసిండా మాట తూచా తప్పకుండా పాటించారు న్యూజిలాండ్ దేశస్తులు . కరోనా కట్టడి కాకపోవడంతో దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని గుర్తిస్తూ, వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ప్రత్యేక క్లస్టర్లుగా మార్చి మరింత పటిష్టమైన ప్రణాలికలు అమలు చేస్తున్నారు.

లాక్ డౌన్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా..ప్రజలు కూడా పూర్తి సహకారం:

లాక్ డౌన్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా చేశారు.అత్యవసర వస్తువులతో పాటు, పిల్లల మనసు అర్దం చేసుకుని కామిక్ పుస్తకాలు, కథలు పుస్తకాలు, పిల్లల మేధస్సు పెంచే పుస్తకాలు అందుబాటులో ఉండేలా చేసారు..ఎంతైనా తల్లి కదా.. ప్రజలు కూడా ప్రభుత్వాలకు పూర్తి సహకారం అందించారు.

అధికారికంగా కరోనా ఫ్రీ దేశంగా ఇంకా ప్రకటించలేదు. ఎందుకంటే?

ఆర్ధికంగా దెబ్బతిన్నా ప్రజల ఆరోగ్యమే తనకు ముఖ్యం అంటూ ప్రధాని జసిండా అర్డెర్న్ విధించిన కఠిన లాక్ డౌన్ నిబంధనలే ఆ దేశాన్ని విజయం వైపు నడిపించింది. ప్రస్తుతం అక్కడ లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసే పరిస్థితి నెలకొంది. సరిహద్దులు మాత్రం మూసే ఉంచాలని ఆలోచనలో ఉన్నారంట. అయితే అధికారికంగా న్యూజిలాండ్‌ని కరోనా ఫ్రీ దేశంగా ఇంకా ప్రకటించలేదు. ఎందుకంటే చివరిగా కరోనా సోకిన వ్యక్తి తర్వాత మరో నాలుగు వరాల వరకు కొత్త పాజిటివ్ కేసు రాకపోతే అప్పుడు కరోనా ఫ్రీగా అయినట్లు ప్రకటిస్తామని న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ నిర్ణయించింది. జూన్ 15 నాటికి ఆ గడువు పూర్తవుతుంది. ఏది ఏమైనా ఆ స్థాయి వరకు చేరడం కూడా విజయం అందుకున్నట్టే.


End of Article

You may also like