లాక్ డౌన్ ఎఫెక్ట్: ఆ అంచనా ప్రకారం మే నెలాఖరికి 4 కోట్ల మంది భారతీయులకు ఫోన్లు ఉండవు?

లాక్ డౌన్ ఎఫెక్ట్: ఆ అంచనా ప్రకారం మే నెలాఖరికి 4 కోట్ల మంది భారతీయులకు ఫోన్లు ఉండవు?

by Megha Varna

Ads

కరోనా కారణంగా దాదాపు అన్ని దేశాలలో  గత నెల రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతుంది .అయితే ఈ లాక్ డౌన్ కారణంగా  ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ విచ్ఛిన్నం అయింది కాగా స్టాక్ మార్కెట్లు అతి దారుణంగా కుప్పకూలిపోయాయి..

Video Advertisement

ఇంకా ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు బాధ కలిగించే ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.లాక్ డౌన్ కారణంగా 4 కోట్ల మందికి ఫోన్లు ఉండవు అని ఇండియన్ సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ తెలిపింది .లాక్ డౌన్ కారణంగా మొబైల్ హ్యాండ్ సెట్ ,స్పేర్ పార్ట్శ్ విడి భాగాలపై నిషేధం కొనసాగుతుంది.ఇలా నిషేధం కొనసాగితే మే నెలాఖరు నాటికీ 4 కోట్లమంది మొబైల్స్ వాడలేరని ఇండియన్ సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ వెల్లడించింది.ఇప్పటికే వారి వద్ద ఉన్న మొబైల్స్ పనిచేయకపోవడం వల్ల ఇలా జరగడానికి అవకాశం ఉందని తెలిపింది ..

ఇప్పటికే 2 కోట్లమంది ఫోన్లు పని చేయక ,కొత్త ఫోన్లు కొనలేక ,విడి భాగాలు దొరకక  సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపింది..అందువలన నిషేధం త్వరలోనే ఎత్తివేయాలని కోరుతుంది ఈ సంస్థ.మొబైల్ చాలా అత్యవసరం అని మొబైల్ లేకుండా కొన్నిసార్లు ప్రాణ హాని కూడా జరిగే అవకాశం ఉందని కావున మొబైల్ అమ్మకాలను ఈ లాక్ డౌన్ లో అత్యవసరాల జాబితాలో చేర్చాలని ఇప్పటికే మొబైల్ సంస్థల యజమానులు పలు సార్లు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ని మరియు ఇతర అధికారులను  కలవడం జరిగింది.

మొబైల్ ఫోన్స్ పనిచేయని వారి సంఖ్య మే చివరికి 4 కోట్ల మందికి పైగా విస్తరిస్తుందని మొబైల్ సంస్థలు లేఖ ద్వారా ప్రైమ్ మినిస్టర్ కు తెలిపారు .మొబైల్ పరికరాల అమ్మకాలు ఆన్ లైన్ ద్వారా ,మరియు దశలవారీగా రిటైల్ ద్వారా అమ్ముకునే అవకాశం కల్పించాలని కోరారు .మందులు ,కిరాణా సరుకులతో పాటు మొబైల్స్ ను కూడా ‘అవసరమైన సేవలు’ జాబితాలో చేర్చాలని ఐసిఈఏ చైర్మన్ పంకజ్ మొహీంద్రూ అన్నారు.దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ..


End of Article

You may also like