అలా కాకూడదని 15 కోట్ల రూపాయలను వదిలేసుకున్న ఏకైక హీరోయిన్.. ఎవరంటే..?

అలా కాకూడదని 15 కోట్ల రూపాయలను వదిలేసుకున్న ఏకైక హీరోయిన్.. ఎవరంటే..?

by Sunku Sravan

ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే విషయాన్ని ఈ హీరోయిన్ ని చూస్తే అర్థమవుతుంది. సినీ ఇండస్ట్రీ లో ఎంతోమంది గ్లామర్ బ్యూటీలు ఉన్నారు. కానీ టాలెంట్ తో ఆకట్టుకునే హీరోయిన్స్ చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పవచ్చు. అలాంటి వారిలో మొదటి స్థానంలో ఉంటుంది హీరోయిన్ సాయి పల్లవి. ఆమె ఎలాంటి సినిమాలు తీసిన ప్రేక్షకుల్లో మాత్రం అంచనాలు పెరిగిపోతాయి. ఇలాంటి సాయి పల్లవి ఆ విధంగా బ్యాడ్ కాకుండా ఉండడం కోసం దాదాపు 15 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే వాటిని వదులుకుందట.. మరి అది ఏంటో ఓ సారి చూద్దాం..!!సాయి పల్లవి మొదట డాన్సర్ గా తన కెరీర్ మొదలు పెట్టి, కొన్ని రియాలిటీ షోలలో డాన్స్ పర్ఫామెన్స్ కూడా చేసి ఎంతో ఆకట్టుకుంది. కానీ ఆమెకు డ్యాన్స్ అంతగా పేరు అందించలేకపోయింది. మొదట సాయి పల్లవి ప్రేమమ్ అనే మలయాళం సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద బంపర్ హిట్ కొట్టడంతో సాయి పల్లవి కి మంచి గుర్తింపు లభించింది. అప్పటినుంచి సాయి పల్లవి ఏమాత్రం వెనక్కి చూసుకోకుండా మిగతా భాషల్లో కూడా చాలా క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మూవీ తో ఏ విధంగా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరో అయినప్పటికీ సాయి పల్లవి క్రియేషన్ ఎక్కువగా ఉన్నది. ఇందులో ఆమె 15 లక్షల వరకు పారితోషికం తీసుకున్నది. అయితే ఈ మూవీ సక్సెస్ అవడంతో సాయి పల్లవి తన పారితోషికాన్ని అమాంతం గా కోటి రూపాయలు చేసింది. ఆ తర్వాత సాయి పల్లవి కొత్త సినిమాలు ఊహించని ఫలితాలు వచ్చాయి. ఫిదా మూవీ తర్వాత పడి పడి లేచే మనసు, మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలు అనుకున్నంత ఫలితం ఇవ్వలేకపోయాయి. అయితే రీసెంట్ గా వచ్చిన లవ్ స్టోరీ తో సక్సెస్ అందించిన విషయం తెలిసిందే. అయితే నానితో శ్యాం సింగరాయ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.మెగాస్టార్ తో మూవీ రిజెక్ట్ :
ఆమె వరుస విజయాలతో దూసుకు పోవడంతో అగ్ర హీరోలతో కూడా నటించే అవకాశం వచ్చింది. కానీ ఈ అమ్మడు మాత్రం తనకు నచ్చిన సినిమాలు మాత్రమే ఓకే చేసుకుంటూ వెళ్తోంది. చిరంజీవి భోళాశంకర్ లో ఒక పాత్రకు సంబంధించి ఆమెకు ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసి మూవీ చేయనని చెప్పి క్లారిటీ ఇచ్చేసింది. ఈ విధంగా ఆమె అనేక పెద్ద పెద్ద సినిమాలను రిజెక్ట్ చేస్తూ వచ్చింది. అయితే సాయి పల్లవి కొన్ని కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించే అవకాశం ఉన్నా ఆ వైపు వెళ్లి సంపాదించుకోవాలి అనుకోలేదు. ఆమెకు న్యాచురల్ గా ఉండడం ఇష్టం అని డ్యూటీకి సంబంధించినటువంటి వాటిని ప్రమోట్ చేయడం ఇష్టం లేదని, మన చిరునవ్వు కంటే బ్యూటీ నెస్ ఏదీ ఉండదని చెప్పుకొస్తుంది సాయి పల్లవి. ఇలా ఆమె చాలా సినిమాలు వదులుకోవడమే కాకుండా కమర్షియల్ యాడ్స్ ను కూడా రిజెక్ట్ చేసి పక్కన పెట్టారు. ఒకవేళ ఇవన్నీ ఆమె చేసి ఉంటే 15 కోట్ల వరకు ఆదాయం వచ్చి ఉండేది. ప్రస్తుతం ఈమె విరాట పర్వం మూవీ తో పాటుగా మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Video Advertisement


You may also like