Home Filmy Adda లీకైన ఎన్టీఆర్ 30…స్టోరీ అలానే ఉంటుందా..?

లీకైన ఎన్టీఆర్ 30…స్టోరీ అలానే ఉంటుందా..?

by Megha Varna

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. క్రౌడ్ పుల్లింగ్ చేయగల కెపాసిటీ ఉన్న మాస్ హీరో. ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా గుర్తింపును తెచ్చుకున్నారు. 2001లో నిన్ను చూడాలని మూవీతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నంబర్ 1తో బ్రేక్ అందుకున్నారు.

అంతకుముందు బాలనటుడిగా బాల రామాయణం శ్రీ రామ చంద్రుడి పాత్ర లో మెరుపులు మెరిపించారు. టాలీవుడ్ లో మంచి టేస్ట్ ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు.

see what these NTR charecters teach us..!!

కథల ఎంపిక లో పర్ఫెక్ట్ గా ఉండే ఎన్టీఆర్ టెంపర్ చిత్రం నుంచి మరింత జాగ్రత్తగా కథలు ఎంచుకుంటూ బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూ ఉన్నారు. కథలు, పాత్రల విషయం లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు. ప్రస్తుతం కొరటాల శివ సినిమా పని లో వున్నారు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు.

కానీ అనౌన్స్ చేసి చాలా కాలం అయ్యింది. కానీ షూటింగ్ ఎప్పుడు షురూ చేస్తారు అనేది క్లారిటీ లేదు. ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఆసక్తి తో ఈ సినిమా కోసం చూస్తున్నారు. ఎన్టీఆర్ 30 పై శ్రద్ధ ఎక్కువ పెడుతున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌ లో సినిమా చెయ్యాలనే ఉద్దేశం తో ఎన్టీఆర్ ఉన్నారట. కొరటాల శివ స్క్రిప్ట్‌ను రీ రైట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

jr ntr is not the first choice for ntr 30 koratala siva movie

లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వద్దామనేమో. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ముఖ్యమైన విషయం లీక్ అయ్యింది. గరుడ పురాణంలోని ఒక టాపిక్ ని తీసుకుని కధ సిద్ధం చేస్తున్నారట. 18 వేల శ్లోకాలు గరుడ పురాణంలో వున్నాయి. కాగా ఓ ముఖ్యమైన టాపిక్ ని మాత్రమే దీని నుండి తీసుకున్నారు. దీని ఆధారంగానే మూవీ చేస్తే అందరికీ నచ్చుతుందని కొరటాల భావిస్తున్నారు. అపరిచితుడుని కూడా గరుడ పురాణం ఆధారంగా తీశారు. మరి ఈ సినిమా అదే స్టైల్ లో ఉంటుందా లేదా వేరేగా వుంటుందా అనేది చూడాలి.

You may also like