దేవర స్టోరీ లీక్…. కథ మామూలుగా లేదుగా…ఇక ఊచకోతే…

దేవర స్టోరీ లీక్…. కథ మామూలుగా లేదుగా…ఇక ఊచకోతే…

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న నెక్స్ట్ చిత్రం దేవర. ఇది ఎన్టీఆర్ 30వ చిత్రం కావడమే కాకుండా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో… ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.

Video Advertisement

కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ టైటిల్ తోని అంచనాలను భారీగా పెంచింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ప్రస్తుతం ఆన్లైన్ లో హల్చల్ చేస్తుంది. దేవర స్టోరీ కి సంబంధించిన ఈ న్యూస్ బాగా వైరల్ అయింది. ఈ సినిమా ఒక రియల్ లైఫ్ స్టోరీ ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా విలన్ క్యారెక్టర్ లో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. దేవర చిత్రంతో జాన్వీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ మరియు సైఫ్ అలీ ఖాన్ మధ్య ఫైటింగ్ సన్నివేశాలు గూస్ బంప్స్ వచ్చే లెవెల్ లో కొరటాల శివ ప్లాన్ చేశారు. ఈ చిత్రం ఒక యదార్థ సంఘటన ఆధారంగా దారుణమైన హత్యాకాండను హైలైట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 1985 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తుఫాను రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్ బాపట్ల సమీపంలోని కారంచేడు ప్రదేశంలో జరిగిన ఓ సంఘటనను ఇందులో ప్రధానంగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

దళితులను క్రూరంగా కొందరు అగ్రవర్ణ దుండగులు ఊచకోత కోస్తారు. ఈ సంఘటన తర్వాత వందలాది మంది దళితులు నిరాశ్రయులు అవుతారు. ఈ సంఘటనను చిత్రంలో హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవిక సంఘటన నుంచి తీసుకున్నటువంటి అంశంతో వారు అప్పుడు అనుభవించిన బాధ, వేదన అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యే విధంగా స్టోరీ రూపొందించడం జరిగింది. మరి పూర్తి కథ విడుదలయ్యాకే తెలియాలి…..


You may also like

Leave a Comment