కరోనా వైరస్ గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని భయపెడుతున్న సంగతి తెల్సిందే. ఈ వైరస్ ధాటికి 900 మంది మరణించగా వేలాదిమంది ఇంకా బాధించబడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది వైద్యులకు వైరస్‌ సోకడం బాధాకరం. అయితే పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరాయంగా వైద్య సేవలు అందించి అలసి సొలసిన కొందరు చైనా డాక్టర్లు, నర్సుల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల వెనకున్న కథేంటో మీరే చూడండి.

Video Advertisement

ఈ మహమ్మారి నుంచి రక్షించేందుకు పగలు, రాత్రి.. అని తేడా లేకుండా వీళ్లు సేవలందిస్తున్నారు. దీని వెనుక ఎంతో అనుభవం కలిగిన ప్రఖ్యాత వైద్యుల నుంచి ఆస్పత్రిలో పని చేసే సాధారణ నర్సుల వరకు ఎంతోమంది శ్రమ ఉంది.  ‘కరోనా వైరస్‌తో పోరాడే క్రమంలో.. తమ సుదీర్ఘమైన షిఫ్ట్‌ పూర్తైన తర్వాత మాస్కులు తొలగించాక, ఈ నర్సుల ముఖాలు ఇలా ఉన్నాయి. ఈ ఫొటోలు లక్షలాది మంది ప్రజల హృదయాలను తాకుతున్నాయి. ఈ ఏంజెల్స్‌కి సెల్యూట్‌..!’ అంటూ రాసుకొచ్చారు. ప్రజల శ్రేయస్సు కోసం ఈ నర్సులు పడుతోన్న శ్రమను ప్రశంసిస్తూ నెటిజన్లు ఈ ఫొటోలను తెగ షేర్‌ చేస్తున్నారు.

Real Hero ???