నువ్వు లేని లోకంలో నేను ఉండలేనమ్మా అంటూ…తల్లి మృతిని తట్టుకోలేక..!

నువ్వు లేని లోకంలో నేను ఉండలేనమ్మా అంటూ…తల్లి మృతిని తట్టుకోలేక..!

by Megha Varna

తల్లి ప్రేమికి మించింది ఏది లేదు ఈ లోకంలో అలాగే తల్లి లేని లోటు కూడా ఎవరు తీర్చలేనిది.ఈ సృష్టిలో అందరికి కూడా తల్లి మీద ప్రేమ అధికంగా ఉంటుంది.అయితే కొందరికి మాత్రం తల్లి లేని లోటు ఉంటుంది వారిని మళ్ళీ తల్లిలా చూసేవారు ఎవరూ ఉండరు ఈ లోకంలో.అయితే మేడిపల్లి లో ఓ విషాదం చోటు చేసుకుంది.అనుకోకుండా తల్లి మరణించడంతో ఆ కొడుకు కూడా ఆత్మ హత్య చేసుకున్నాడు.వివరాల్లోకి వెళ్తే..

శివకుమార్ అనే వ్యక్తికీ చిన్నతనంలోనే తండ్రి దూరం అయ్యాడు.పైగా పేద కుటుంబం దీంతో శివకుమార్ తల్లి కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించింది.తండ్రి లేని కుమారుడు కావడంతో మరి ప్రేమగా చూసుకుంది తల్లి విజయ.ఎప్పుడూ కూడా తండ్రి లేని లోటు తెలియకుండా కొడుకును పెంచింది.శివకుమార్ 10 వ తరగతి దాక చదివాకా పెయింటర్ గా పనిచేస్తున్నారు. అయితే ఈ నెల 16 వ తారీఖున అనుకోకుండా వాటర్ మోటర్ ఆన్ చేస్తూ హఠాత్తుగా కరెంటు షాక్ కి గురయ్యి మరణించారు విజయ.దీంతో చిన్నతనం నుండి తనను ఎంతో ప్రేమతో చూసుకున్న తల్లి దూరం అవ్వడంతో శివకుమార్ మొన్నటిదాకా తీవ్రంగా రోదిస్తున్న ఉన్నారు.

representative image

నువ్వు లేని లోకంలో నేను ఉండీ ఉపయోగం ఏంటమ్మా అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.దగ్గర ఉన్నవాళ్లు ఎవరూ కూడా శివకుమార్ ను ఓదార్చలేకపోయారు. దీంతో తీవ్రమైన డిప్రెషన్ కు లోనయ్యారు శివకుమార్.అయితే మరుసటి రోజు తల్లి కర్మకాండ కార్యక్రమం అనగా ముందురోజు పెయింట్ లో వాడే ఒక కెమికల్ తో నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు శివకుమార్.

You may also like