Ads
శ్రీకాకుళం కర్మాగారాల తనిఖీ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఒక ఘటన చర్చలకు దారి తీసింది. టీవీ 9 కథనం ప్రకారం, సీనియర్ అసిస్టెంట్ అయిన
బి. కుసుమ కుమారి గత 18 సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నారు. కుసుమ కుమారి బాధ్యతారాహిత్యంగా పని చేస్తున్నారు అని కంప్లైంట్ లు ఉన్నాయి.
Video Advertisement
ఆ కారణంగా కార్యాలయంలో అధికారులు సీసీ కెమెరాలు పెట్టించారు. ఇటీవల సర్టిఫికెట్ కోసం వచ్చిన ఒక వ్యాపారి దగ్గర లంచం తీసుకున్నారు కుసుమ కుమారి. కుసుమ కుమారి డబ్బులు తీసుకొని నవ్వుతూ ఆ డబ్బులని కెమెరా వైపు చూపిస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది.
అవతల వ్యక్తి మాస్క్ కట్టుకొని ఉండడంతో మొఖం కనిపించలేదు. దీంతో కర్మాగారాల శాఖ డైరెక్టర్ చంద్ర శేఖర్ శర్మ, కుసుమ కుమారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :
https://youtu.be/ngQA_8_lQDo
End of Article