ఆ ఒక్క బొమ్మ చైనా అధ్యక్షుడిని ఇబ్బంది పెట్టిందా.?

ఆ ఒక్క బొమ్మ చైనా అధ్యక్షుడిని ఇబ్బంది పెట్టిందా.?

by Mohana Priya

Ads

విన్నీ ద పూ బొమ్మ మీ అందరికీ తెలిసే ఉంటుంది. చూడడానికి ముద్దుగా భలే ఉంటుంది కదా. ఆ బొమ్మకి చైనా కి సంబంధం ఉంది. ఏంటి? మళ్లీ ఏదైనా కొత్త వైరస్ వచ్చిందా? ఆ వైరస్ కి విన్నీ పేరు పెట్టారా? ఇలాంటి ప్రశ్నలన్నీ మీలో కొంతమందికైనా వచ్చే ఉంటాయి. టెన్షన్ పడకండి. అదేం కాదు. అసలు విషయం ఏంటంటే ఆ బొమ్మను చైనా అధ్యక్షుడు షి జిన్‌ పింగ్‌‌ తో పోలుస్తారు.

Video Advertisement

చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వ అధికారుల పై అపహాస్యం చేసేలా మాట్లాడడం అక్కడ నిషిద్ధం. కాబట్టి వాళ్ళని తిట్టడానికి ఉపయోగించే పదాలను చైనాలో నిషిద్ధం చేశారు. అందుకే షార్ట్ కట్ లో జిన్ పింగ్ ని విన్నీ ద పూ కార్టూన్ బొమ్మ తో పోలుస్తారు.

అలా పోలుస్తూ తయారుచేసిన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో చైనా వాళ్ళు తమ క్రియేటివిటీని ఉపయోగించి జిన్ పింగ్ కి పెట్టిన పేరు ఇతర దేశాల్లో కూడా ఫేమస్ అయింది.

చైనాలో కూడా ఈ కార్టూన్ పిల్లలు ఆడుకునే బొమ్మలు కావడంతో విన్నీ ద పూ పదాన్ని బహిరంగంగా వాడుతూ జిన్‌ పింగ్ ని  ట్రోల్ చేస్తున్నా కూడా నిషేధించలేకపోయారు. కానీ అక్కడి ఇంటర్నెట్ సర్వర్లలో విన్నీ పేరు కొడితే డిస్ప్లే అవ్వదు. ఎందుకంటే ఆ పేరుతో ఉన్న లింక్స్ అన్నిటినీ ఆపేశారు.

అంతేకాకుండా విన్నీ పేరుతో వచ్చిన ఒక వీడియో గేమ్ లో విన్నీ ని జిన్‌ పింగ్ తో పోల్చినట్టు కొన్ని విషయాలు వుండడంతో ఆ గేమ్ ను ప్లే స్టోర్ లో నుండి తీయించేశారు.

ఇదంతా పక్కన పెడితే, ఒక్కసారి పైన ఉన్న ఫోటో చూడండి. ఒక కుక్క పిల్ల బొమ్మలతో ఆడుకుంటోంది. అంతే కదా? అని అనుకుంటున్నారా. ఒక్కసారి ఆ బొమ్మను చూడండి. విన్నీ బొమ్మే అది. ఆ ఫోటో ను అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ కుక్క పిల్ల తన పెంపుడు కుక్క పిల్ల. దాంతో చైనా వాసులకి ఇది తమ నాయకుడిని ఉద్దేశించి అన్నమాటేనా అని ఒక అనుమానం కలిగింది.

కోవిడ్ 19 కు సంబంధించి ఇటీవల పాంపియో చేసిన వ్యాఖ్యలపై చైనా ప్రజలు మండిపడ్డారు. పాంపియో చెప్పేవి అన్నీ అబద్ధాలే అని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. దాంతో పాంపియో కి చైనా కి మధ్య సత్సంబంధాలు లేవు.

twitter/mikepompeo

అంతేకాకుండా చైనాలో పాంపియో కి వ్యతిరేకంగా ఎన్నో వార్తలు ఉన్నాయి. ఇప్పుడు పాంపియో పెట్టిన ఈ ఫోటో పై మిగిలిన దేశాల వాళ్లు పాంపియో కి మద్దతు ఇస్తూ మీమ్స్ చేస్తున్నారు. కానీ చైనాలో ట్విట్టర్ అధికారికంగా నిషేధించబడింది. కాబట్టి చైనా ప్రజలు పాంపియో పెట్టిన పోస్ట్ కి ఎక్కువగా స్పందించడం లేదు. పాంపియో కి ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా చైనా జవాబు ఇస్తుందేమో చూద్దాం.

 

 


End of Article

You may also like