Ads
కరోనా వైరస్ ఒకరి నుండి ఒకరికి శ్వాస ద్వారా ,తాకిడి ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెందడం వలనే ప్రపంచమంతా కరోనా విజృభించింది.అందుకే సామాజిక దూరం పాటించాలంటూ మాస్క్లు ధరించాలంటూ ప్రబుత్వాలన్నీ ఇంతలా ప్రచారం చేస్తున్నాయి.అయితే సెలూన్ లో కటింగ్ చేయించుకున్నందుకు వెళ్లిన 80 మంది పైగా కరోనా భారిన పడినట్లు యూకే మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది.ఇప్పటిదాకా దాదాపు అన్ని దేశాలు పూర్తి లాక్ డౌన్ లో ఉన్నాయి.దీంతో ఎవరికీ సెలూన్ కి వెళ్లే అవకాశం కూడా లేకపోయింది.
Video Advertisement
ఒక్కసారిగా లాక్ డౌన్ ఎత్తివేయడంతో జనం విపరీతంగా సెలూన్ల బాట పట్టారు.ఒక్కసారిగా ఇంతమంది ఒకచోట గుమిగూడడంతో ఎప్పుడు ఎవరికీ కరోనా సోకుతుందో తెలియక ప్రబుత్వాలన్నీ భయపడుతున్నాయి.ఈ మధ్యకాలంలో అమెరికా లో లాక్ డౌన్ ముగియడంతో గ్రేట్ క్లిప్స్ అనే సెలూన్ కు స్థానికులు విస్తృతంగా వెళ్లారు.మే నెల మధ్యకాలంలో ఎక్కువగా గ్రేట్ క్లిప్స్ కు ఎక్కువమంది కస్టమర్లు వచ్చారని తెలుస్తుంది.అయితే ఆ సెలూన్ లో పనిచేస్తున్న వ్యక్తి కి కరోనా లక్షణాలు ఉన్నా కూడా అదేమి పట్టించుకోకుండా సెలూన్ లో పనిచేసాడు.
అతనికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.దీంతో అధికారులు అప్రమత్తమయి సెలూన్ కి వచ్చిన కస్టమర్ల జాబితాను తీసుకోని వారిని కలవగా వారిలో కూడా కరోనా లక్షణాలు కనపడడంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.దీంతో ఆ షాప్ కి వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు చెయ్యగా అందులో 85 మందికి పైగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.కాగా వారందిరిని ఐసొలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తడంతో అక్కడి అధికారులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.
source: v6 news
End of Article