Ads
సినిమా నటులు చాలా మంది సినిమాల్లోకి రాకముందు ఒకలాగా, వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటారు. అంటే, అంతకు ముందు లావుగా ఉండడం, సినిమాల్లోకి రావడానికి సన్నబడడం, ఇంకా నటనకు సంబంధించిన విషయాలు నేర్చుకోవడం, డాన్స్, ఫైట్స్ లాంటివి నేర్చుకోవడం చేస్తుంటారు.
Video Advertisement
కొంత మంది ఈ విషయాలన్నిటినీ చిన్నప్పటి నుంచే నేర్చుకుంటే, కొంత మంది మాత్రం సినిమాల్లోకి వచ్చే ముందు వీటిపై అవగాహన పెంచుకుంటారు.
చాలా మంది హీరోయిన్లు కూడా సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఒకలాగా ఉంటారు. అలా ఒక హీరోయిన్ కి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పైన ఫోటోలో ఉన్న వ్యక్తిని గమనించారా? ఈమె ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాల్లో నటిస్తున్నారు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా బిజీ అయ్యారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు పూజా హెగ్డే. ఈ ఫోటో పూజా హెగ్డే మోడలింగ్ టైంకి సంబంధించిన ఫోటో.
పూజా హెగ్డే మొదట్లో చాలా అడ్వర్టైజ్మెంట్స్ లో నటించారు. తర్వాత తమిళంలో జీవాతో కలిసి ఒక సినిమాలో నటించారు. ఈ సినిమా తెలుగులో మాస్క్ పేరుతో విడుదల అయ్యింది. ఆ తర్వాత తెలుగులో ఒక లైలా కోసం, ముకుంద, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం పూజ హీరోయిన్ గా నటించిన రాధే శ్యామ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
End of Article