Home News “నన్ను ఇందులోకి లాగకండి”…ఫన్ బకెట్ భార్గవ్ కేస్ విషయంలో క్లారిటీ ఇచ్చిన OMG Girl నిత్య.!

“నన్ను ఇందులోకి లాగకండి”…ఫన్ బకెట్ భార్గవ్ కేస్ విషయంలో క్లారిటీ ఇచ్చిన OMG Girl నిత్య.!

by Mohana Priya

యూట్యూబ్ లో కామెడీ వీడియోస్ ద్వారా అలాగే టిక్ టాక్ ఫేమస్ అయిన వ్యక్తి ఫన్ బకెట్ భార్గవ్. అయితే గత కొద్ది రోజుల నుండి ఫన్ బకెట్ భార్గవ్ వార్తల్లో నిలిచారు. ఈ విషయంపై భార్గవ్ తో అంతకు ముందు నటించిన నిత్య ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. నిత్య ఆ వీడియోలో ఈ విధంగా తెలిపింది. “ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్ అయిన మాట నిజమే. బట్ నాకు ఆ కేస్ కి ఎటువంటి సంబంధం లేదు. మీకు ఆ విషయం ఎలా తెలిసిందో, నాకు కూడా అలాగే సోషల్ మీడియా ద్వారానే తెలిసింది.

omg girl nitya about fun bucket bhargav issue

నా ఫాలోవర్స్, వ్యూవర్స్ నాకు మెసేజ్ చేయడం వల్ల నేను ఆ న్యూస్ చూడడం జరిగింది. నాకు ఇంకా మెసేజ్ చేస్తున్నారు ఏం జరిగింది అని. నాకైతే ఏ విషయం తెలియదు. తెలియదు అని చెప్పడానికి, అలాగే నాకు ఆ మేటర్ కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఆ కేస్ కి ఎటువంటి సంబంధం లేదు. భార్గవ్ ని కలిసి ఇప్పటికీ వన్ ఇయర్ అయింది. నాకు కాంటాక్ట్ లో కూడా లేడు.

omg girl nitya about fun bucket bhargav issue

వీడియోస్ కూడా చేయట్లేదు. నేను షూట్స్ లో ఉన్నాను. హైదరాబాద్ కి మూవ్ అయిపోయాం. మీమర్స్, ట్రోలర్స్, యూట్యూబర్స్ నా ఫోటోలు వాడుతున్నారు. మీరందరూ తెలియక చేస్తున్నారేమో అని వీడియో చేయడానికి వచ్చాను. కావాలని చేయకపోతే డిలీట్ చేస్తారు అని కోరుకుంటున్నాను. మీకు టూ డేస్ లో తెలుస్తుంది. నిజాలు ఏంటో బయటికి వస్తాయి కదా, అప్పుడు అయినా డిలీట్ చేస్తారు అని కోరుకుంటున్నాను.”

omg girl nitya about fun bucket bhargav issue

నిత్య తల్లి కూడా మాట్లాడుతూ ఈ విధంగా పేర్కొన్నారు. “మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి అందరి కోసం మేము ముందుకు వచ్చాము. మాకు సపోర్ట్ చేసే వాళ్లందరికీ చాలా థాంక్స్. మేమైతే ఇప్పుడు షూట్ లో ఉన్నాము. మేము చాలా హ్యాపీ గా ఉన్నాము. సేఫ్ గా ఉన్నాము.” అని అన్నారు.

omg girl nitya about fun bucket bhargav issue

నిత్య మాట్లాడుతూ “నా వెల్ విషర్స్ కి, ఫాలోవర్స్ అందరికీ చాలా థాంక్యూ. నా కోసం చాలా మంది బాధపడుతూ మెసేజెస్ పెడుతున్నారు నాకు ఏమైనా అయిపోయిందేమో అని. బట్ నేను చాలా హ్యాపీగా, సేఫ్ గా షూట్ లో ఉన్నాను. థాంక్యూ సో మచ్” అని చెప్పింది.

watch video :

You may also like