కరోనా దెబ్బకు సినిమాలు లేక… కిరానా కొట్టు పెట్టుకున్న డైరెక్టర్!!

కరోనా దెబ్బకు సినిమాలు లేక… కిరానా కొట్టు పెట్టుకున్న డైరెక్టర్!!

by Mohana Priya

Ads

కరోనా వల్ల చాలా రంగాల్లో ఆర్థిక నష్టాలు వచ్చాయి. అందులో సినిమా రంగం చాలా ముఖ్యమైనది. ఒక సినిమా ఆగిపోవడం వల్ల ఎంతోమంది టెక్నీషియన్లకు నష్టం వస్తుంది. దర్శకులు, యాక్టర్లు, ప్రొడ్యూసర్లు, కెమెరామెన్, స్పాట్ బాయ్స్, మేకప్ మెన్, లైట్ మెన్, ఇలా ఒక సినిమాకి కొన్ని వందల మంది పనిచేస్తారు. కాబట్టి ముఖ్యంగా కంటే ఎక్కువగా నష్టపోయిన రంగం సినిమా రంగం అని చెప్పొచ్చు. అలా లాక్ డౌన్ వల్ల సినిమా ఆగిపోయిన ఒక దర్శకుడు ప్రస్తుతం ఒక కిరాణా కొట్టు తెరిచాడు.

Video Advertisement

దాదాపు గత పదేళ్ల నుంచి తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆనంద్ అనే దర్శకుడు వచ్చే ఏడాది వరకు సినిమా థియేటర్లు తెరిచే అవకాశం లేదని తెలుసుకొని తను సంపాదించిన డబ్బుల తో తన స్నేహితుడి దగ్గర ఒక బిల్డింగ్ అద్దెకు తీసుకొని చెన్నైలోని మౌలివాక్కంలో కిరాణా కొట్టు ప్రారంభించాడు.ఈ విషయంపై ఆనంద్ మాట్లాడుతూ “లాక్‌డౌన్‌ లో నేను ఇంట్లోనే ఉన్నాను. తమిళనాడులో కిరాణా దుకాణాలు తెరవడానికి అనుమతి ఇస్తున్నారని తెలుసుకుని నేను కూడా కిరాణా దుకాణం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. పప్పులు, నూనె, ధాన్యాలు ఇంకా ఇంటికి కావలసిన కిరాణా వస్తువులను నేను చాలా తక్కువ ధరకే అమ్ముతున్నాను. దాంతో ఎక్కువ మంది వచ్చి కొనుక్కుంటారు. నాకు చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.

“ముందు ప్రజల్లో ఉన్న భయం పోవాలి. అంతవరకూ సినిమా పరిశ్రమ తిరిగి ఎప్పటిలాగా పని ప్రారంభిస్తుంది అని నేను అనుకోవడం లేదు. పార్కులు, షాపింగ్ మాల్స్ తెరుచుకున్న తర్వాతే సినిమా థియేటర్లు తెరుచుకుంటాయి. అప్పుడే మా కెరియర్ కూడా మళ్లీ తిరిగి మొదలవుతుంది. పరిస్థితి అంతా మామూలుగా అయ్యేవరకు నేను నా కిరాణా దుకాణానికే పరిమితం అవుతాను” అని చెప్పారు.ఒరు మళై నాంగు సారల్, మౌన మళై వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు ఆనంద్. ఆయన మూడవ చిత్రం తునింతు సెయ్ నిర్మాణం చివరి దశలో ఉంది. ఇంకా రెండు పాటలు పెండింగ్ లో ఉన్నాయి.


End of Article

You may also like