ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇక మారరా..? కీపర్ బంతిని వదిలేసి బ్యాట్స్‌మన్‌ కాళ్లను పట్టుకున్నాడు.! (వీడియో)

ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇక మారరా..? కీపర్ బంతిని వదిలేసి బ్యాట్స్‌మన్‌ కాళ్లను పట్టుకున్నాడు.! (వీడియో)

by Megha Varna

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో జరిగిన ఓ ఘటన క్రికెట్ అభిమానులను నవ్వాపుకోలేకపోతున్నారు,ఆదివారం లాహోర్‌ క్వాలండర్స్‌-కరాచీ కింగ్స్‌ల మధ్య మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కరాచీ కింగ్స్ 188 పరుగుల లక్ష్యాన్ని నెలకొల్పింది. ఆ తరువాత లాహోర్ ఖలందర్స్ ఛేజింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలో 10 ఓవర్‌లో డెల్‌పోర్ట్ వేసిన బంతిని బ్యాట్స్‌మెన్ బెన్ డంక్ రివర్స్ స్వీప్ చేయబోయాడు. కానీ బంతి ఎడ్జ్‌ తీసుకుని పైకి లేచింది.కానీ బంతి ఎడ్జ్‌ తీసుకుని పైకి లేచింది. కీపర్ చాడ్విక్‌ క్యాచ్ పట్టడానికి ట్రై చేసాడు ,కీపర్ క్యాచ్ పట్టే సమయంలో బంతి ఎక్కడుందో కనబడలేదు, కీపర్ క్యాచ్‌ వదిలేసి కాళ్లను చుట్టేయడం మాత్రం ఫన్నీగా అయ్యింది.

Video Advertisement

క్యాచ్ అయితే మిస్సయ్యాడు కానీ ప్రేక్షకులు మాత్రం అందులోని కామెడీని మిస్ కాలేదు. అతడు బెన్‌ను వాటేసుకోవడం చూసిన ప్రేక్షకులు పెద్ద పెట్టున నవ్వారు. ఈ ఫన్నీ వీడియోకు మాత్రం సెటైర్లు వస్తున్నాయి ,ఇలాంటివి కేవలం పాకిస్తాన్ లో మాత్రమే జరుగుతుందని కొంతమంది అభిమానులు ఎద్దేవా చేయగా, కీపింగ్‌ చేయకుండా కాళ్లు మొక్కుతావేంట్రా నాయనా అని కామెంట్స్ చేస్తున్నారు,ఈ వీడియో పై నెటిజన్లు తమదైన స్టైల్లో ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు


You may also like

Leave a Comment