Ads
చిన్న వాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకూ చిరుతిళ్లు తినడానికి బాగా ఇష్టపడతారు. మార్కెట్లో మనకు దొరికే లేస్ మొదలైన వాటిని కొనుక్కుని తింటూ ఉంటారు. అయితే ఐదు రూపాయలు పెట్టి కొనే లేస్ ప్యాకెట్ లో కేవలం ఆరు చిప్స్ మాత్రమే ఉండడం ఘోరం.
Video Advertisement
నిజానికి ప్యాకెట్ పెద్దగా కనపడినా కేవలం ఆరు బంగాళాదుంప చిప్స్ ఏ ఉండడం అన్న విషయం వైరల్ గా మారింది. తాజాగా ఒక పిల్లవాడు ఒక చిప్స్ ప్యాకెట్ ని కొని దానిని ఓపెన్ చేసి అందులో ఉన్న చిప్స్ ని లెక్క పెట్టాడు. కేవలం ఆరు చిప్స్ మాత్రమే అందులో ఉండడంతో ఆ పిల్లవాడు షాకయ్యాడు.
చిప్స్ ని తీసి వాటికి ఫోటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఐదు రూపాయల లేస్ ప్యాకెట్ లో ఆరు చిప్స్ వచ్చాయని క్యాప్షన్ కూడా పెట్టాడు. పైగా ఆ ప్యాకెట్ పై 40 శాతం ఎక్కువ అని వ్రాసి ఉండటం గమనార్హం. 40 శాతం మోర్ చిప్స్ అని ఉంటేనే 6 ఉన్నాయి. లేదు అంటే నాలుగే ఉండేవంటూ నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
https://twitter.com/samsarcastix/status/1462699365554790402?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1462699365554790402%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fa-netizen-shares-photo-of-chips-packet-which-have-only-6-layer-tweet-goes-viral-584580.html
End of Article