Ads
కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్ మొదలుపెట్టిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. 2013 లో వచ్చిన ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. దిల్ రాజు గారు ఈ సినిమాని నిర్మించారు. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరూ కలిసి తెర మీద కనిపించడం అనేది ప్రేక్షకులు ఎవరూ అప్పటివరకు ఊహించలేదు.
Video Advertisement
ఇందులో అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు. అయితే, ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు 9 సంవత్సరాలు అవుతోంది. ఇందులో హీరోల పేర్లు మాత్రం ఎవరికీ తెలియదు. వెంకటేష్ ని పెద్దోడు అని, మహేష్ బాబు ని చిన్నోడు అని పిలుస్తారు. అవి వాళ్ల ఒరిజినల్ పేర్లా? లేకపోతే వేరే పేర్లు ఏమైనా ఉన్నాయా? అనే విషయం మాత్రం ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోయింది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంటర్నెట్ పేజ్ లో వెంకటేష్ పేరు మల్లికార్జున రావు అని ఉంది. అలాగే మహేష్ బాబు పేరు సీతారామరాజు అని ఉంది. మరి ఇది ఎంతవరకు నిజమో ఆ పేజ్ క్రియేట్ చేసి, అందులో ఇన్ఫర్మేషన్ రాసిన వాళ్లకు మాత్రమే తెలియాలి. ఇంకొక విషయం ఏంటంటే వికీపీడియాలో కూడా వీళ్లిద్దరి పేర్లు పెద్దోడు చిన్నోడు అనే ఉంటాయి.
అయితే, ఇప్పుడు ఇలా సోషల్ మీడియాలో వాళ్ళ పేర్లు ప్రత్యక్షం అవడంతో ఈ సినిమా మళ్లీ ఒకసారి వైరల్ అవుతోంది. ఏదేమైనా, అసలు ఈ సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు పేర్లు ఇవే అనే విషయం సినిమా రాసి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ అడ్డాల కి, అలాగే నిర్మించిన దిల్ రాజు గారికి అయినా తెలుసో లేదో కదా.
End of Article