Ads
ఆర్మాక్స్ మీడియా ప్రతి నెలకి టాప్ తెలుగు హీరో, హీరోయిన్స్ లిస్ట్ విడుదల చేస్తుంది. అలా ఈ సంవత్సరం మే నెలకు విడుదల చేసిన హీరోల లిస్ట్ ప్రకారం మొదటి స్థానంలో మహేష్ బాబు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో అల్లు అర్జున్, ప్రభాస్ ఉన్నారు. ఇదే విధంగా హీరోయిన్స్ లిస్ట్ కూడా విడుదల చేశారు. ఇందులో మొదటి స్థానంలో సమంత నిలిచారు.
Video Advertisement

గత సంవత్సరం మొదట్లో జానుతో అలరించిన సమంత ఈ సంవత్సరం ఫ్యామిలీ మ్యాన్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇందులో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించారు. ఇప్పటి వరకు మనం సమంతని అలాంటి పాత్రలో చూడలేదు. ఈ సిరీస్ చూసిన వాళ్లు అందరూ సమంత నటన రెండవ సీజన్ కి హైలైట్ గా నిలిచింది అని అన్నారు.

ఇంక లిస్ట్ లో రెండవ స్థానంలో కాజల్ ఉన్నారు. కాజల్ కూడా ఈ సంవత్సరం మోసగాళ్లు సినిమాతో మొదలుపెట్టి, తర్వాత మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అంతే కాకుండా ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ని కూడా అనౌన్స్ చేశారు కాజల్. ఆర్మాక్స్ మీడియా సర్వే ప్రకారం టాప్ టెన్ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 సమంత అక్కినేని

#2 కాజల్ అగర్వాల్

#3 అనుష్క శెట్టి

#4 పూజా హెగ్డే

#5 రష్మిక మందన

#6 తమన్నా భాటియా

#7 కీర్తి సురేష్

#8 సాయి పల్లవి

#9 రకుల్ ప్రీత్ సింగ్

#10 రాశి ఖన్నా

End of Article
