టీ.ఆర్.పి కోసం ఆత్మహత్య చేసుకునేంత టార్చర్…కావాలనే గొడవలు.? మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన కామెంట్స్.!

టీ.ఆర్.పి కోసం ఆత్మహత్య చేసుకునేంత టార్చర్…కావాలనే గొడవలు.? మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన కామెంట్స్.!

by Mohana Priya

Ads

బిగ్ బాస్ షో కి ప్రతి భాషలోనూ విపరీతంగా క్రేజ్ ఉంది. మనకి తెలియకుండానే ఆ కంటెస్టెంట్ లతో మనం ఎంతగానో కనెక్ట్ అయిపోతాం. మనకి నచ్చిన కంటెస్టెంట్ ని ఎవరైనా తిడితే మన సొంత వాళ్లని తిట్టినట్టు ఫీల్ అయిపోతాం. తిట్టించుకునే వాళ్ళ మీద జాలి తిట్టే వాళ్ళ మీద కోపం చూపిస్తాం. అలా షో లో అందరి చేత తిట్లు పడి అందరు కంటెస్టెంట్స్ వేలెత్తి చూపించిన వాళ్లే చివరికి గెలుస్తారు. ఏదేమైనా చాలా సార్లు ఇదే ఫార్ములా రిపీట్ అయింది.

Video Advertisement

తమిళ్ బిగ్ బాస్ లో ఒక సంచలనం క్రియేట్ చేసిన కంటెస్టెంట్ ఓవియా హెలెన్. మామూలుగా సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండే వాళ్లకి ఈ పేరు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. షో లో జరిగిన వివాదాలు కానీ, సూసైడ్ వ్యవహారం
వల్ల కానీ, కారణం ఏదైనా కానీ ప్రేక్షకులు ఓవియా ని ఎంతగానో ఇష్టపడ్డారు.

ఆ సీజన్ సమయం లో ఎక్కడ చూసినా ఓవియా గురించే మాట్లాడేవాళ్ళు. బిగ్ బాస్ షో సమయంలోనే కాకుండా ఇప్పుడు కూడా ఓవియా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఓవియా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరూ చర్చించుకునే విషయంగా మారాయి.

తమిళ్ బిగ్ బాస్ కూడా దాదాపు ఇదే సమయంలో మొదలవుతుంది. దానికి ఓవియా ఇప్పుడు బిగ్బాస్ మొదలవ్వాలా లేక బ్యాన్ చెయ్యాలా? అని సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ని అడిగారు.

టిఆర్పీ కోసం షో యాజమాన్యం కంటెస్టెంట్ లతో గొడవ పడడం లాంటి పనులు చేయిస్తున్నారని, దానివల్ల టార్చర్ గా అనిపిస్తుంది అని, తమ టీఆర్పీ కోసం కంటెస్టెంట్ లతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేంత ఇబ్బంది పెట్టొద్దు అని సోషల్ మీడియా వేదికగా ఓవియా చెప్పారు.

చాలా మంది తను చెప్పిన దానికి మద్దతు ఇస్తే మరికొంతమంది బిగ్ బాస్ షో వల్లే నువ్వు అందరికీ తెలిసావు అన్న విషయం మర్చిపోకు అని విమర్శలు చేస్తున్నారు. తరుణ్ ఇటీవల నటించిన సినిమా ఇది నా లవ్ స్టోరీ సినిమాలో హీరోయిన్ గా నటించారు ఓవియా. కాంచన ఫోర్ లో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు.


End of Article

You may also like