ప్లాన్ ప్రకారం ముస్లిం ల దగ్గర నుంచి బాబ్రీ మసీదుని లాక్కున్నారు.. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేళ ఓవైసీ కామెంట్స్.!

ప్లాన్ ప్రకారం ముస్లిం ల దగ్గర నుంచి బాబ్రీ మసీదుని లాక్కున్నారు.. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేళ ఓవైసీ కామెంట్స్.!

by kavitha

Ads

కోట్లాదిమంది హిందువులు ఎదురుచూస్తున్న అపూర్వ ఘట్టం ఎట్టకేలకు రానే వచ్చింది. దేశం మొత్తం రామనామం జపంతో, భక్తిపారవత్యంతో మునిగిపోతున్నారు. వారి భక్తిని వివిధ రూపాలలో తెలియజేస్తున్నారు. ప్రతి హిందువు ఈరోజు ఒక హిందువుగా గర్వపడుతున్న వేళ కొందరు రాజకీయ నాయకులు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలకెక్కుతున్నారు. హైదరాబాద్ ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ అయోధ్య గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

Video Advertisement

ఇంతకీ ఆయన ఏమన్నారంటే 1992లో బాబ్రీ మసీదుని కూల్చి వేయకుంటే నేడు ముస్లింలు ఇలాంటి వాటిని చూడవలసిన అవసరం ఉండేది కాదు. 500 ఏళ్లుగా బాబ్రీ మసీదులో ముస్లింలు నమాజ్ చేశారని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గోవింద్ వల్లబ్ పంత్ ఉన్నప్పుడు మసీదులో విగ్రహాలు పెట్టారని ఓవైసీ ఆరోపించారు. అదే సమయంలో అయోధ్య జిల్లాకు కలెక్టర్ గా నాయర్ ఉండే వారిని ఆయన బాబ్రీ మసీదును మూసివేసి అక్కడ పూజలు చేయడం ప్రారంభించారంటూ ఓవైసీ చెప్పుకొచ్చారు.

విశ్వహిందూ పరిషత్ పుట్టినప్పుడు రామ మందిరం లేదని ఓవైసీ చెప్పడం గమనార్హం. మహాత్మా గాంధీ అసలు అయోధ్య రామాలయం గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఒక ప్లాన్ ప్రకారమే భారతీయ ముస్లింల దగ్గర నుంచి బాబ్రిని లాక్కున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రతి మంగళవారం సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా నిర్వహిస్తామని చెబుతున్నారు.

ఈ విషయం గురించి ఎవరు ఏమి మాట్లాడటం లేదని తన ఆవేదన వ్యక్తం చేశారు ఓవైసీ. మెజారిటీ వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు అందుకే ఈ విషయం గురించి ఎవరూ ఏమి మాట్లాడటం లేదు. ప్రతిపక్ష పార్టీలను ముఖ్యంగా ఆప్ మెజారిటీ వర్గాలని సంతోషపెట్టే పనిలో నిమగ్నమయ్యారు అందుకే ఈ సమయంలో మైనార్టీల గురించి ఎవరూ మాట్లాడటం లేదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

watch video:


End of Article

You may also like