ఇంతకుముందు చూసుంటే నవ్వొచ్చేది ఏమో? కానీ ఇప్పుడు కన్నీళ్లొస్తున్నాయి.!

ఇంతకుముందు చూసుంటే నవ్వొచ్చేది ఏమో? కానీ ఇప్పుడు కన్నీళ్లొస్తున్నాయి.!

by Mohana Priya

Ads

గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం గారు ఇంకా మన మధ్య లేరు అనే విషయం ఇప్పటికి కూడా చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. బాలు గారు జూన్ 4 న , 1946 లో జన్మించారు. గాయకుడిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా కూడా ఎంతో పేరు సంపాదించారు బాలు గారు. సినీ సంగీతం లో ఆయన కృషి ని ప్రశంసిస్తూ జాతీయ ప్రభుత్వం 2001 లో పద్మశ్రీ ని, 2011 లో పద్మ భూషణ్ ని ప్రకటించింది. బాలు గారు ఆరు సార్లు జాతీయ స్థాయి లో ఉత్తమ గాయకుడిగా అవార్డు ను అందుకున్నారు.

Video Advertisement

ఇవే కాకుండా 53 సంవత్సరాల సినీ ప్రస్థానం లో ఇంక ఎన్నో అవార్డులను, అలాగే ఎంతో మంది అభిమానులను సంపాదించారు. అలాగే పాడుతా తీయగా వంటి కార్యాక్రమాల ద్వారా ఎంతో మంది యంగ్ టాలెంట్స్ ని ప్రోత్సహించారు.  పాడుతా తీయగా ఆఫ్ స్క్రీన్ లో అంటే బిహైండ్ ద సీన్స్ జరిగేవి (బ్లూపర్స్) షో యాజమాన్యం యూట్యూబ్ లో పెడతారు. ఈ వీడియోలు చూస్తే బాలు గారు ఎంతో సరదా మనిషి అని అనిపిస్తుంది.

ఒక వీడియోలో పార్టిస్పెంట్ లాగా వెళ్లి కొంచెం టెన్షన్ తో పాట పాడి, జడ్జిమెంట్ చెప్పమని అడిగి, అవతల వైపు వ్యక్తి కొంచెం గుటకలు ఎక్కువ అయ్యాయి, మీరు కొంచెం నీళ్లు తాగితే బాగుండేది అని చెప్పడంతో బాలు గారు ఇప్పుడు నేను ఈ రౌండ్ లో ఉంటానా? అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి వేరే పార్టిస్పెంట్స్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పడంతో బాలుగారు ఏడుపు నటిస్తారు.

అప్పుడు అక్కడ కూర్చుని ఉన్న కంటెస్టెంట్స్ వచ్చి బాలు గారిని ఓదారుస్తారు. ఇదంతా సరదాగానే జరిగింది. ఒకప్పుడు ఇవన్నీ చూస్తే మనకి కూడా సరదాగా అనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం బాలు గారు మన మధ్య లేరు అన్న విషయం మళ్ళీ గుర్తొస్తుంది. ఇది ఒక్కటే కాదు పాత పాట ఏది విన్నా కూడా బాలు గారు కచ్చితంగా గుర్తొస్తారు.

ఎందుకంటే కొన్ని దశాబ్దాల వరకు దాదాపు ప్రతి సినిమాలో బాలు గారి పాటలు ఉండేవి. అప్పుడు అన్నిచోట్ల బాలు గారి పాటలే వినిపించేవి. ఇప్పుడు కూడా, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఆయన పాటలు ప్రతిచోటా వినిపిస్తాయి. కానీ అంతకు ముందు ” బాలు గారు చాలా బాగా పాడుతారు” అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు “బాలు గారు చాలా బాగా వాడేవారు” అని అనుకుంటాం. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు.

watch video :

 


End of Article

You may also like