మద్యం మత్తులో పాముని కొరికిన వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా?

మద్యం మత్తులో పాముని కొరికిన వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా?

by Sainath Gopi

Ads

మాములుగా జనాలు పామును చూడడానికే భయపడతారు . కానీ ఆ వ్యక్తి మాత్రం దానిని కొరికి కొరికి చంపేశాడు .అది కర్ణాటకలోని … కోలార్ లో జరిగిన ఘటన . లాక్ డౌన్ వలన ఈ మధ్యనే మద్యం దొరకడంతో అప్పుడే తాజాగా కొనుకున్న మందు బాటిల్ తో ఇంటికి వెళ్తున్నాడు 38 ఏళ్ళ కన్స్ట్రక్షన్ వర్కర్ కుమార్ . మస్తూర్ గ్రామానికి చెందిన కుమార్ అప్పటికే పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడు .ఆలా బైక్ మీద వెళ్తుండగా ఓ పాము కుమార్ బైక్ కు అడ్డంగా వచ్చింది .ఇంటికి ఎప్పుడు వెళ్లి క్వార్టర్ ఫినిష్ చేద్దామా అనే మూడ్ లో ఉన్న కుమార్ కు దానిని చూడగానే పిచ్చి కోపం వచ్చింది .

Video Advertisement

బైక్ రెండు చక్రాల మధ్య పాము ఉంది . దాన్ని పట్టుకొని మెడలో వేసుకున్నాడు . కొంత దూరం బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాక …పాము అటు ఇటు కదులుతుంటే చిరాకు వచ్చింది కుమార్ కి .దీంతో బైక్ ను సడన్ గా ఆపి పామును చేతులతో పట్టుకున్నాడు .అప్పటికే జనం గుమిగూడి ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏంటి పామును ఇలా పట్టేసుకున్నాడు అని.పామును ఎడమ చేత్తో పట్టుకుని జంతికలు కోరినట్టు కొరుకుతుంటే చుట్టూ ఉన్న జనం నివ్వెరపోయారు .అది చాలా విషపూరితమైన పాము ఎందుకిలా చేస్తున్నాడు అని అక్కడ ఉన్న జనం వింతగా మాట్లాడుకున్నారు .సదరు సంఘటన ను వీడియో ఫోటోలు తీశారు .

సమాచారం తెలిసిన పోలీసులు అరగంట తర్వాత ఘటన స్థలానికి చేరుకున్నారు .ఆ సమయానికే పాము చచ్చిపోయింది. పోలీసులు ఆ వ్య్తకి ఏక్కడ ఉంటాడో తెలుసుకొని ఇంటికి వెళ్లారు . ఎందుకిలా చేసావ్ అని పోలీసులు అడగగా ..నాకు అది పాము అని అసలు తెలియదు సార్ అన్నాడు .కానీ నాకు ప్రమాదం ఏమి జరగదు అంటూ తన మూడేళ్ళ కొడుకు వైపు చూసాడు . డాక్టర్ దగ్గరకి వెళ్దాం అని పోలీసులు అడగగా నాకు ఏమి జరగదు అయినా మా ఊరిలో ఇలాంటి పాములను చాలానే చూస్తూ ఉంటాం అని సమాధానమిచ్చాడు కుమార్.

 

ఇది ఇలా ఉండగా..కుమార్‌ను ముల్‌బాగల్ అటవీ శాఖ అధికారులు అరెస్టు చేసి అతనిపై కేసు నమోదు చేసారు. వన్యప్రాణి కార్యకర్త శరత్ బాబు ఇండియన్ ఎక్స్‌ప్రెస్.కామ్‌తో మాట్లాడుతూ “కుమార్ కొరికిన పాము ర్యాట్ స్నేక్, దీనిని కన్నడలో కేరె హావు అంటారు. అటవీ అధికారుల ప్రకారం, కుమార్ పామును ఎత్తుకొని అతని మెడలో ఉంచాడు. తరువాత దానిని కొరికేటప్పుడు మద్యం సేవించడం ప్రారంభించాడు. “మేము అక్కడికి చేరుకున్నప్పుడు, కుమార్ ఒక దుకాణం దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు పాము చనిపోయింది” అని అధికారి చెప్పారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మొదలైన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది.

 


End of Article

You may also like