50 ఏళ్ల నాటి ఫోటో వెనకున్న కథ…మానసికంగా బెదిరిపోయిన పాక్ సైనిక జనరల్స్… ఓ పెద్ద మైండ్ గేమ్.!

50 ఏళ్ల నాటి ఫోటో వెనకున్న కథ…మానసికంగా బెదిరిపోయిన పాక్ సైనిక జనరల్స్… ఓ పెద్ద మైండ్ గేమ్.!

by Megha Varna

Ads

చరిత్రలో జరిగిన అన్ని యుద్ధాల వెనక చాలా పెద్ద ప్రణాళికలే ఉంటాయి. అదే విధంగా బంగ్లాదేశ్ యుద్దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ యుద్ధంలో భారతదేశం చాలా ముందుగానే ఆలోచించి ప్రణాళికను తయారు చేసి చైనా, అమెరికా మరియు పాకిస్తాన్, ఈ మూడు దేశాలను ఆశ్చర్య పరిచేలా చేసింది. నిజానికి ఆ సమయంలో ఆ దేశాల వారికి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. దాని వల్లనే ఆ సందర్భంలో పాకిస్థాన్ రెండు భాగాలుగా ఏర్పడింది.

Video Advertisement

ఇదంతా జరగడానికి మన భారతదేశ సైన్యం సుమారు ఒక సంవత్సరం కష్టపడి ప్రణాళికను రూపొందించడం విశేషం మరియు ముఖ్యంగా దాన్ని అనుసరించిగలిగారు. దాంతోనే ఇప్పుడు బంగ్లాదేశ్ దేశం ఉందని చెప్పాలి. బంగ్లాదేశ్ ఏర్పడి 50 ఏళ్ళు పూర్తయ్యాయి. అయితే బంగ్లాదేశ్ యుద్ధం లో చివరి రోజు డిసెంబర్ 16. ఆ రోజున ఎన్నో గుర్తుండిపోయే సంఘటనలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా పాకిస్తాన్ దేశానికి సంబంధించిన సైనికులను మరియు అధికారులను భారతదేశపు సైన్యం మానసికంగా వాళ్లని దెబ్బతీశారు. అదంతా ఒక మైండ్ గేమ్ ద్వారానే సాధ్యం అయిందని చెప్పాలి.

అసలు ఈ యుద్ధం మొదలు పెట్టింది పాకిస్తాన్ దేశం వాళ్లే. డిసెంబర్ మూడవ తేదీన ఆపరేషన్ ఛెంఘిజ్ఖాన్ అని ప్రారంభించారు. కానీ వారి ఆపరేషన్ ఫెయిల్ అయింది, భారతదేశ సైన్యం ఆపరేషన్ ట్రైడెంట్ తో దాన్ని ఆపగలిగారు. అయితే రష్యా లో ఉన్న ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ కోపరేషన్ ఒప్పందాన్ని ఆ సమయంలో అమెరికా మరియు బ్రిటన్ వారు వాడుకున్నారు. దాంతో వీరి నావికాదళాలు యుద్ధంలోకి చొరబడకుండా చేసుకోగలిగారు. దీని తర్వాతనే తంగైల్ పారాడ్రాప్ మొదలైంది.

పాకిస్తాన్ సైన్యం డిసెంబర్ 11 న, సాయంత్రం కాగానే భారత్ లోకి 50 విమానాలు తో దండెత్తి బంగ్లాదేశ్ మధ్యలో ఉన్న ప్రాంతం వైపు వెళ్ళాయి. దాంతో భారత సైన్యం కొన్ని రకాల ఆయుధాలు మరియు ఇతర సాధన సంపత్తితో ఆ ప్రదేశానికి చేరుకున్నాయి, రెండు బెటాలియన్ల కమాండోలు కూడా పాల్గొన్నారు. ఈ భారతదేశ సంబంధించిన కమాండోలు జమునా నది పైన వంతెనను స్వాధీనం చేసుకున్నారు. అయితే అక్కడి స్థానికులు కూడా భారతదేశ సైన్యానికి తోడుగా నిలిచారు.

ఈ విథంగా పాకిస్తాన్ సైన్యం డాకా వైపు వెళ్లేందుకు మార్గం లేకుండా చేశారు. ఇదే యుద్ధం ఒక రోజు పాటు కొనసాగి 350 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోవడం జరిగింది. అయితే ఇదే పోరు కొనసాగిన తర్వాత భారత సైన్యం డిసెంబర్ 16 వ తేదీన డాకాకు చేరుకున్నారు, డాకా ప్రాంతం నుండి పాకిస్థాన్ కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ ఏఏకె నియాజీను లొంగిపొమ్మని కోరారు. పైగా ఉదయం తొమ్మిది గంటల వరకు సమయం ఇవ్వడం జరిగింది. అయితే పాకిస్థాన్ సైన్యం నుండి ఎటువంటి జవాబు రాలేదు.

దాంతో భారత సైన్యానికి సంబంధించిన మేజర్ జనరల్ గాంధర్వ నాగ్ర ఈ సందేశాన్ని పంపించారు, డియర్ అబ్దుల్లా నువ్వు లొంగిపో నేను డాకా లోనే ఉన్నాను నిన్ను కూడా సురక్షితంగా చూసుకుంటాను. ఈ సందేశాన్ని తీసుకువెళ్ళిన అధికారులు నియాజీ లొంగిపోవడంతో అతన్ని తీసుకొని వచ్చారు. దాంతో కాల్పుల విరమణ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడగించడం జరిగింది. ఆ సమయంలో పాకిస్తాన్ మేజర్ మానసికంగా ఎంతో కుంగిపోవడం జరిగింది. పైగా భారత జనరల్ ను చూసిన వెంటనే కన్నీళ్లు ఆగలేదు, మీ ద్రోహులు మమ్మల్ని చంపేశారు అని నియాజీ చెప్పారు.

అయితే ఒక లొంగుబాటు పత్రాన్ని నిపుణులతో ఆరోజు మధ్యాహ్నమే రాయించి భారత మేజర్ జనరల్ జకాబ్ డాక చేరుకున్నారు. నేరుగా డాక లో ఏఏకే నియాజి ఉన్న సైనిక ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. లొంగుబాటు పత్రంలోని వివరాలను ఆయన చదివారు. అక్కడ నియాజీ తో పాటు ఫర్ మాన్ అలీ అనే సైనిక అధికారి కూడా ఉన్నారు. అయితే చివరి ప్రయత్నం చేద్దామని జకానీ కాస్త తెలివిగా అనుసరించబోయారు. లొంగి పోతున్నాం అని ఎవరన్నారు..? కాల్పుల విరమణ దళాల ఉపసంహరణపై చర్చిద్దామని రమ్మని చెప్పాను అని తెలివిగా మాట్లాడాడు.

నియాజీ మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న జాకబ్ అతనికి నచ్చజెప్పడానికి చూశాడు. అయితే ఫలితం ఏమాత్రమూ లేకపోయింది. అయితే మీరు కనుక లొంగిపోతే జెనీవా ఒప్పందం ప్రకారం గౌరవంగా చూసుకుంటాము. ఒకవేళ కనుక అంగీకరించకపోతే ఆ తర్వాత పరిణామాలకు బాధ్యత మాది కాదు అరగంట సమయం ఇస్తున్నాను అని చెప్పాడు. ఒకవేళ కనుక తిరస్కరిస్తే యుద్ధం కొనసాగుతుంది అని చెప్పారు. అలానే బాంబింగ్ మొదలవుతుందని అన్నారు. సమాధానం కోసం చూడకుండా వెంటనే గదిలో నుంచి బయటకు వచ్చేశారు. అయితే జకాబ్ లోపల ఎంత ఆందోళన చెందుతున్న బయటకు మాత్రం చాలా ఆత్మవిశ్వాసంతో కనపడ్డారు.

అరగంట తర్వాత లొంగిపోతున్నా అని రెండుసార్లు ప్రశ్నించడం జరిగింది కానీ నియాజీ మౌనంగా ఉన్నారు. మూడో సారి అడిగిన తర్వాత మీ మౌనం అంగీకారంగా భావిస్తున్నాను అని చెప్పారు. అలానే పత్రంపై సంతకాలు చేయడానికి రేస్ కోర్స్ లో ఏర్పాటు మొదలు అవుతున్నాయని అన్నారు. అలానే అయితే ఖడ్గాన్ని అందరి ముందు అప్పగించాలని కూడా సూచించారు. కానీ ఖడ్గం లేదు అని రివాల్వర్ ని ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. అందరి ఎదుటకి వెళ్లి లొంగుబాటు పత్రంపై సంతకాలు చేయమనడం మాత్రం పాక్ జనరల్ ని ఇబ్బంది పెట్టింది. అలాగే భారతీయ ఈస్టర్న్ కమాండ్ జీఓసి ఆరోడాకి గౌరవవందనం ఇవ్వాలని పాక్ సైనిక జనరల్ కు షరతు విధించారు. కానీ దానికి ఒప్పుకోలేదు.

అక్కడ పరిస్థితి అర్థం చేసుకున్న భారత ఆర్మీ చీఫ్ జనరల్ శామ్ మానిక్ షా కి ఈస్టర్న్ కమాండ్ జీవోసి ఇన్ సి ఉదయం కాల్ చేసి పత్రాల లొంగుబాటు కార్యక్రమాన్ని చూసుకోవాలని చెప్పారు. దీనికి ఆరోడ సతీమణి కూడా వచ్చారు. సాయంత్రం నాలుగున్నర సమయంలో లెఫ్టినెంట్ జనరల్ సతీ సమేతంగా వెళ్లారు. లొంగుబాటు పత్రంపై 4:55 నిమిషాలకు నియాజి సంతకాలు చేశారు. నిజానికి 04:31 కి సంతకాలు చేయాల్సి ఉంది.

అయితే మొదటి సారి చేసినా సంతకాలు పత్రంలో లోపం ఉంది అందుకనే రెండోసారి కూడా సంతకాలు చేశారు. టైమ్స్ లండన్ లో ప్రచురించిన తంగల్ ఎయిర్ డ్రాప్ చిత్రం మనోభావాల్ని దెబ్బతీస్తుందని. ఆ తర్వాత స్వయంగా దీనిని ఏఏకే నియాజీ అంగీకరించారు. బ్రిగేడ్ మొత్తం డాక లో దిగినట్లు వుంది అని అన్నారు. అయితే భారత్ ఒక బెటాలియన్ లో దాదాపు 700 నుంచి 1000 లోపు సైనికులు మాత్రమే కలిగి ఉంటుంది. మిగిలిన చోట్ల కేవలం పారాచూట్ లను మాత్రమే వదిలారు. అయితే వాస్తవానికి ఆగ్రాలో భారత సైనికులు చేసిన విన్యాసాలు ఫోటోలని మీడియాకు చూపడంతో అది పాక్ మానసిక స్తైర్యాన్ని కోల్పోయేలా చేసింది.


End of Article

You may also like