పాకిస్తాన్ లో సోషల్ మీడియా బై బై ? పాకిస్తాన్ చేసిన తప్పు ఇదే…

పాకిస్తాన్ లో సోషల్ మీడియా బై బై ? పాకిస్తాన్ చేసిన తప్పు ఇదే…

by Megha Varna

Ads

నేటి ఆధునిక సమాజంలో సోషల్ మీడియా పాత్ర అందరికీ తెలిసిందే. కొన్ని కోట్ల మంది ప్రజలు వ్యాపారం కోసం వ్యక్తిగత అవసరాల కోసం సోషల్ మీడియా ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో సోషల్ మీడియా తన యూజర్ల వ్యక్తిగత రక్షణ కోసం కొన్ని నియమ నిబంధనలను పాటిస్తూ ఉంటుంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం కొన్ని కొత్త నియమాలను పెట్టింది వీటి ప్రకారం పాకిస్తాన్లోని సోషల్ మీడియా యూజర్లు అందరి ఇన్ఫర్మేషన్ ను మెయింటైన్ చేసే ఒక కంపెనీ ఉండాలి దానితో పాటుగా సిబ్బంది కూడా ఉండాలి. పాకిస్తాన్ కి సంబంధించి ఏదైనా వ్యతిరేకమైన సమాచారం యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు ఆ యూజర్ యొక్క సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని పాకిస్తాన్ గవర్నమెంట్ కి సిబ్బంది అందజేయాల్సి ఉంటుంది.

Video Advertisement

పదిహేను రోజుల లోపు ఈ సమాచారాన్ని15 రోజుల లోపు ఈ సమాచారాన్ని గవర్నమెంట్ కి అంద చేయకపోయినా నిబంధనలను పాటించకపోయినా భారీ మొత్తంలో గవర్నమెంటుకు సోషల్ మీడియా వాళ్లు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అయితే ప్రతి వ్యక్తికి భావవ్యక్తీకరణ హక్కు ఉంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం నియమాల వల్ల వారి యూజర్ల వ్యక్తిగత ఆచారానికి రక్షణ పొందవచ్చు అని ప్రముఖ సోషల్ మీడియా కంపెనీలు అయినా ఫేస్బుక్ గూగుల్, ట్విట్టర్ మిగిలిన కంపెనీలు భావిస్తున్నాయి. పాకిస్తానీ ప్రభుత్వం కనుక ఈ నియమాలను సవరించుకోకపోతే పాకిస్తాన్ లో తమ సేవలను నిలిపి వేస్తామని ఈ కంపెనీలు తెలిపాయి.


End of Article

You may also like