Ads
యూట్యూబ్ ద్వారా ఎంతో మంది ఫేమస్ అవుతారు. ఇందులో తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కొంత మంది యూట్యూబ్ ద్వారా తమ కెరీర్ ప్రారంభించి, తర్వాత సినిమాల్లోకి వెళ్తారు. లేదా కొంత మంది అయితే యూట్యూబ్ లోనే స్టార్ అయిపోతారు.
Video Advertisement
వీళ్ళకి కూడా దాదాపు సినిమా హీరో హీరోయిన్ల కి ఉన్నంత క్రేజ్ ఉంటుంది. ఒక యూట్యూబ్ ద్వారా ఇంత గుర్తింపు తెచ్చుకోవచ్చు అని చాలామంది నిరూపించారు. కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ చేస్తే, మరి కొంతమంది వెబ్ సిరీస్ లాంటివి చేస్తూ ఉంటారు.
ప్రముఖ యూట్యూబర్ చందుగాడు , పక్కింటి కుర్రాడు యూట్యూబ్ ఛానల్స్ క్రియేటర్ నటుడు చందుసాయి అందరికీ పరిచయమే. సోషల్ మీడియాలో అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తాజాగా దగడ్ వెబ్ సెరీస్ తో అలరించాడు.పలు సినిమాల్లో కూడా నటించాడు. అయితే ఈ రోజు చందు సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు అతడిని శుక్రవారం అరెస్ట్ చేశారు.
యువతి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం…..నార్సింగికి చెందిన యువతికి యూట్యూబర్ చందుసాయి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. 2021 ఏప్రిల్ 25న బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు పిలిచి ఆమెని ఇబ్బంది పెట్టాడు. పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడు. అతడి చేతిలో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు చందుపై అమ్మాయిని ఇబ్బంది పెట్టినందుకు, మోసం కింద కేసులు నమోదు చేశారు. చందుతో పాటు అతడి తల్లిదండ్రులు సహా మరో ఇద్దరిపైనా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
చందుగాడు యూట్యూబ్ ఛానల్‌కు ఐదున్నర లక్షల పైచిలుకు సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.ఇది అతని ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్. ఎన్నో వీడియోల ద్వారా చందు చాలా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా అతని పక్కింటి కుర్రాడు అనే ఒక సిరీస్ చందు సాయిని యూట్యూబ్ లో ఒక స్టార్ చేసింది. గత మూడు నాలుగు సంవత్సరాల నుండి ఎన్నో వీడియోస్ చేశాడు. ఈ కేస్ మీద ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
End of Article