ANIMAL MOVIE PALACE: యానిమల్ సినిమాలో చూపించిన ప్యాలెస్ ఆ స్టార్ హీరోది అని తెలుసా.? దాని ఖరీదు ఎంతంటే.?

ANIMAL MOVIE PALACE: యానిమల్ సినిమాలో చూపించిన ప్యాలెస్ ఆ స్టార్ హీరోది అని తెలుసా.? దాని ఖరీదు ఎంతంటే.?

by Sainath Gopi

Ads

మన తెలుగు దర్శకుడు బాలీవుడ్ లో తన సత్తా చాటి విజయ పతాకం ఎగురవేసిన సినిమా యానిమల్.ఇందులో రణబీర్ కపూర్ రష్మిక మందన్న తృప్తి దిమ్మిరి హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈనెల 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫాదర్ సెంటిమెంట్ సినిమా ప్రేక్షకులని థ్రిల్ ఫీల్ అయ్యేలాగా చేసింది.

Video Advertisement

ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ సంపాదించుకొని కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తుంది ఈ సినిమా అయితే ఈ సినిమా లో రణబీర్ కపూర్ ప్యాలెస్ చూస్తే మతి పోవాల్సిందే. ఈ సినిమాకి ఈ భవంతి కూడా ఒక మంచి ప్లస్ పాయింట్.అయితే ఈ భవంతి ఎవరిదో దాని ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లపెట్టాల్సిందే. ఇంతకీ ఈ ప్యాలెస్ ఎవరిదంటే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కి చెందినది.

వీరిది రాజకుటుంబం అన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ ప్యాలెస్ 10 ఎకరాలు తీర్ణంలో 150 గదులను కలిగి ఉంటుంది దీని విలువ సుమారు 800 కోట్ల వరకు ఉంటుంది ఈ ప్యాలెస్ లో ఇప్పటికే చాలా సినిమాలు తీశారు. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే రెండు రోజుల్లో 236 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక ఆదివారం 120 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకొని వీకెండ్ పూర్తయ్యే సరికి వరల్డ్ వైడ్ గా 356 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.

నటన పరంగా కూడా ఈ సినిమాలో రణబీర్ కపూర్ రష్మిక మందన్న జీవించారనే చెప్పొచ్చు రష్మిక మందన్న అయితే తన కెరియర్ బెస్ట్ పిక్చర్ అని గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది. అలాగే తండ్రి కొడుకుల సెంటిమెంట్ ని మరో కోణంలో చూపించిన సందీప్ రెడ్డి వంగ టాలెంట్ నిజంగా మెచ్చుకోవాల్సిందే.


End of Article

You may also like