ఎలక్షన్స్ టైంలో కూడా ఇన్ని గొడవలు అవ్వలేదు ఏమో..! బిగ్ బాస్ ఫినాలే తర్వాత ఇంత గొడవ ఎలా జరిగింది..?

ఎలక్షన్స్ టైంలో కూడా ఇన్ని గొడవలు అవ్వలేదు ఏమో..! బిగ్ బాస్ ఫినాలే తర్వాత ఇంత గొడవ ఎలా జరిగింది..?

by Harika

Ads

బిగ్ బాస్ 7 లో పల్లవి ప్రశాంత్ విజేత కాగా, రన్నర్ గా బుల్లితెర నటుడు అమర్‌దీప్ నిలిచాడు. ఫినాలే ముగిసిన అనంతరం బయటకు వచ్చే వీరిని చూడడానికి ఫ్యాన్స్ భారీగా అన్నపూర్ణ స్టూడియోకు చేరారు. అయితే షో నుండి  బయటి వచ్చిన రన్నర్ అమర్ దీప్‌ తో పాటు, అతని ఫ్యామిలీని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తరిమి కొట్టారు. వందలాది మంది ఒక్కసారిగా కారు పై దాడి చేశారు.

Video Advertisement

స్టూడియో నుండి బయటకు వచ్చిన ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్ మరియు సెలబ్రిటీల కార్ల మీద కూడా రాళ్లు విసిరారు. చేతికి దొరికిన వస్తువులతో అద్దాలను పగలగొట్టారు. ఇప్పటి దాకా జరిగిన బిగ్ బాస్ సీజన్స్ మొత్తంలో ఇలా  ఒక సెలబ్రిటీ పై అటాక్ జరగడం ఇదే తొలిసారి.
అమర్ దీప్‌ని కొట్టిన తరువాతే అన్నపూర్ణ స్టుడియోస్ నుండి వెళ్తామని పబ్లిక్‌గా యూట్యూబ్ ఛానల్స్‌ తో చెప్పిన బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అభిమానులు, అన్నట్టుగానే ఫినాలే షో ముగిసిన తరువాత అర్ధరాత్రి బయటికి వచ్చిన అమర్ దీప్‌ మరియు అతని కుటుంబం పై దాడి చేశారు. వారి కారుని కూడా ధ్వంసం చేశారు. కారులో ఉన్న అమర్ దీప్‌, తల్లి, అతని భార్య, ఫ్రెండ్ నరేష్ లొల్ల,డ్రైవర్ ను భయభ్రాంతులకు గురి చేశారు.బూతులు తిడితూ, కారును అద్దాలను పగులగొట్టారు. అమర్ దీప్‌ని బయటకు లాగాడానికి  ప్రయత్నం చేశారు. దాంతో అమర్ దీప్ తల్లి, భార్య తీవ్ర భయాందోళన పడ్డారు. అరగంట పాటు జరిగిన దాడిలో వదిలేయమని అమర్ తల్లి, ఫ్రెండ్ దండం పెట్టినా వినలేదు. కారుని ధ్వసం చేశారు. ఈ దాడిలో కారులో ఉన్న అమర్ దీప్‌కి, తల్లి, భార్యకి గాయాలు అయినట్టు తెలుస్తోంది. అమర్ దీప్ కారునే కాకుండా, గీతూ రాయల్, అశ్విని కార్లను, ఆర్టీసీ బస్సు, ఇతర వాహనాలను కూడా పగుల గొట్టారు. గీతూ రాయల్ ఈ విషయం పై కేసు పెట్టింది.
గీతూ, అశ్విని సోషల్ మీడియాలో దాడి గురించి పోస్ట్ చేశారు. అమర్ దీప్ పై జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలు వీడియో నెట్టింట్లో వైరల్ గా మారాయి. వీటిని చూసినవారు ఎలక్షన్స్ టైమ్ లో కూడా ఇంత గొడవ అవలేదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి..

1.
2.
3.4. 5. 6. 7. 8.

Also Read: నితిన్ సినిమా కోసం రాజశేఖర్ రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా…?


End of Article

You may also like