పెరుగు అడిగినందుకు కస్టమర్ పై హోటల్‌ సిబ్బంది దాడి చేయడంతో ఆ యువకుడు చనిపోయిన విషయం తెలిసిందే.  ఈ సంఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్‌ ఏరియాలో చోటుచేసుకుంది. అయితే ఈ దాడి పోలీసుల ముందే జరిగినట్లుగా సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా బయటికి వచ్చినట్టు తెలుస్తోంది.

Video Advertisement

వారి ముందే దాడి జరిగినా, పట్టించుకోని పంజాగుట్ట ఎస్సై శివ శంకర్ మరియు హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మెరిడియన్ హోటల్ లో అసలు ఆ రోజు ఏం జరిగిందో? ఈ దాడి పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇప్పుడు చూద్దాం..
పాతబస్తీలో ఉండే లియాఖత్  తన ఫ్రెండ్స్ తో  కలిసి ఆదివారం రాత్రి బిర్యానీ తినడానికి పంజాగుట్ట చౌరస్తాలో ఉన్న  మెరిడియన్‌ హోటల్‌కు వచ్చాడు. రెండు బిర్యానీలు ఆర్డర్ చేసి, తింటూ ఎక్స్‌ట్రా రైతా కోసం వెయిటర్‌ను అడిగారు. ఆ వెయిటర్ ఎన్నిసార్లు చెప్పినా తీసుకురాలేదు. దాంతో గట్టిగా అడిగారు. అలా అరిచినందుకు హోటల్ సిబ్బంది లియాఖత్ ను చితకబాదారు. అతని ఫ్రెండ్స్ 100కు కాల్ చేయగా, పోలీసులు వచ్చి, వారిని బయటకు తీసుకొచ్చారు. కానీ హోటల్ సిబ్బంది పోలీసుల ముందే మరోసారి లియాఖత్  మరియు అతని ఫ్రెండ్స్ పై దాడి చేశారు.
ఆ తరువాత పోలీసులు లియాఖత్‌తో పాటుగా మెరిడియన్ హోటల్ సిబ్బందిని కూడా పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అయితే సిబ్బంది చేతిలో గాయపడిన లియాఖత్‌ ఆయాసం వస్తోందని, తనని ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరాడు. కానీ పోలీసులు పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్టేషన్ లో లియాఖత్‌ మాట్లాడుతూనే కుప్ప కూలిపోయాడు. హాస్పటల్ కి తరలించగా, అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
meredian hotel incidentసమాచారం తెలిసిన లియాఖత్ ఫ్యామిలీ మెంబర్స్ హాస్పటల్ కు వెళ్ళి ఆందోళన చేశారు. దాడి జరిగిన వెంటనే పోలీసులు లియాఖత్ హాస్పిటల్‌కు తీసుకెళ్లకపోవడం వల్లే మరణించాడని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటన పై హత్యనేరం కింద ఆ హోటల్‌ సిబ్బంది పై కేసు రిజిస్టర్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంజాగుట్ట ఎస్సై శివశంకర్‌ మరియు హెడ్‌ కానిస్టేబుల్‌ ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

Also Read: చంద్రబాబు నాయుడు మీద నమోదు చేసిన సెక్షన్స్ ఏంటి..? వాటికి ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటే..?