Ads
విదేశీ వస్తువులపై భారతీయులకి ఉన్న మక్కువ అందరికీ తెలిసిందే. కాని ఈ మక్కువ కేవలం వస్తువులతో మాత్రమే ఆగలేదు, ప్రతి విషయంలోనూ ఉందా అన్న అనుమానంని రేకెత్తిస్తుంది. ప్రతి ఏటా భారతదేశంలో యాక్సిడెంట్స్ వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారో, మరెంతమంది వికలాంగులు అవుతున్నారు అందరికీ తెలిసిన విషయమే.
Video Advertisement
యాక్సిడెంట్ నివారించడం కోసం ప్రభుత్వం వారు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రజలలో ఎంతగా అవగాహన కల్పించడానికి ప్రయత్నించినప్పటికీ రూల్స్ పాటిస్తూ, జాగ్రత్తలతో డ్రైవింగ్ చేసే వారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. కానీ ఈ మధ్య కాలంలో విదేశాల నుండి వచ్చిన ఒక కొత్త వైరస్ వల్ల మనదేశంలో ఒకరి ప్రాణం పోగానే ప్రజలలో విపరీతమైన భయం ఆందోళన పెరిగింది. దాని బారిన పడకుండా ఉండటం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు, మొహానికి మాస్క్ పెట్టుకోవడం ద్వారా తాము సురక్షితంగా ఉంటామని నమ్ముతున్నారు.
ఒక్క రోజు లోని నాలుగు వందలకు పైగా మాస్క్ లు అమ్ముడుపోయాయి అంటేనే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలాగే జాగ్రత్తలు యాక్సిడెంట్ విషయంలో ఎందుకు తీసుకోవడం లేదు, హెల్మెట్స్ ఎందుకు ఇలానే కొనడం లేదు అన్న విషయం చాలామందిలో ప్రశ్నలను లేవనెత్తింది. ఇదే విషయంని ప్రశ్నిస్తూ.. తగిన జాగ్రత్తలు అనేవి వైరస్ విషయంలో అయినా సరే రోడ్ క్రాష్ విషయంలో అయినా సరే తప్పనిసరి అని పంకజ్ నాని ఐఏఎస్ ఈ రోజు ట్విట్ చేసారు.
Is #coronavirusindia more dangerous than this pic.twitter.com/5YGDTrfn8O
— Pankaj Nain IPS (@ipspankajnain) March 4, 2020
End of Article