మూడేళ్ళుగా కొడుకు కోసం వెతుకున్న తల్లితండ్రులు…చివరికి వాళ్ళని కలిపింది “ట్రాఫిక్ చలాన్”.! ఎలాగంటే.?

మూడేళ్ళుగా కొడుకు కోసం వెతుకున్న తల్లితండ్రులు…చివరికి వాళ్ళని కలిపింది “ట్రాఫిక్ చలాన్”.! ఎలాగంటే.?

by Mohana Priya

Ads

వాహనం నడిపేటప్పుడు రూల్స్ పాటించకపోతే పోలీసులు జరిమానా విధిస్తారు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే, అలా ఒక వ్యక్తి రూల్ పాటించనందుకు పోలీసులు వేసిన జరిమానా యొక్క చలానా అతనిని తన కుటుంబంతో కలిపింది. వివరాల్లోకి వెళితే. హైదరాబాద్ లోని మదీనగూడకి చెందిన సత్యనారాయణ ఒక విశ్రాంత ఉద్యోగి. సత్యనారాయణకి సతీష్ ఒక్కరే కొడుకు.

Video Advertisement

సతీష్ కి 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఎనిమిది సంవత్సరాల పాప కూడా ఉంది. సతీష్ కి వ్యవసాయం అంటే ఇష్టం ఉండడంతో తన ఉద్యోగం మానేసి వ్యవసాయరంగంలో కి వెళ్తాను అని తల్లిదండ్రులకు చెప్పారు. సతీష్ తల్లిదండ్రులు దీనికి ఒప్పుకోకపోవడంతో, 2017 లో సతీష్ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. సతీష్ తల్లిదండ్రులు తమ కొడుకు ఆచూకీ కోసం కేపీహెచ్బీ (KPHB) పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు.

సతీష్ జహీరాబాద్ మండలంలోని గోవింద్ పూర్ శివార్లలో వ్యవసాయ క్షేత్రంలో ఒక పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. లాక్ డౌన్ లో సతీష్ ఒకసారి మాస్క్ లేకుండా తిరిగినందుకు పోలీసులు జరిమానా విధించారు. సతీష్ తన ఇంటి నుండి తీసుకెళ్లిన ఈ ద్విచక్ర వాహనం యొక్క చిరునామాకి చలానా వెళ్ళింది.

ఈ చలానా ద్వారా తమ కొడుకు జహీరాబాద్ లో ఉన్నాడు అని తెలుసుకున్న సతీష్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి పరిస్థితిని వివరించారు. విషయం తెలిస్తే కలవరేమో అని సతీష్ ని రహస్యంగా స్టేషన్ కి వచ్చేలా చేశారు. దాదాపు మూడు సంవత్సరాల నుండి దూరంగా ఉన్న సతీష్ ని చూసిన తల్లిదండ్రులు, అలాగే ఇన్ని సంవత్సరాల తర్వాత తన కూతురిని చూసిన సతీష్ భావోద్వేగానికి లోనయ్యారు.

watch video :

 


End of Article

You may also like