Ads
ప్రపంచంలో అది కూడా మన భారతదేశంలో రెండు రకాల మనుషులు ఉంటారు. కొంత మంది ఆడపిల్లలు పుడితే దేవత పుట్టింది అని అంటారు. ఇదే దేశంలో ఆడపిల్ల పుడితే బరువుగా భావించే వారు కూడా ఉంటారు.
Video Advertisement
అయితే ఇటీవల ఒకరి ఇంట్లో ఆడపిల్లకి ఒక కుటుంబం చేసిన గౌరవ మర్యాదలు చూస్తే ఇలాంటి వారు ఇంకా ఉన్నారా అని అనిపిస్తుంది. ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా జార్ఖండ్ కలెక్టర్ ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ షేర్ చేశారు.
ఈ వీడియోలో ఒక అమ్మాయిని కూర్చోబెట్టి తల్లిదండ్రులు ఆమె పాదాల దగ్గర కూర్చున్నారు. ఆమె పాదాలని పళ్లెంలో పెట్టి తండ్రి నీళ్ళతో కడిగి తర్వాత పాలతో కాళ్ళని కడుగుతాడు. ఆ అమ్మాయి కాళ్ళని కడిగిన పాలని తండ్రితో పాటు ఆ అమ్మాయి కూడా తాగుతారు. తర్వాత ఆ అమ్మాయి పాదాలను ఎరుపు రంగు నీళ్ళలో ఉంచి ఒక తెల్లని బట్ట మీద ఆమె పాద ముద్రలు తీసుకున్నారు.
ఈ వీడియో చూసిన కొంత మంది గొప్ప అని కామెంట్ చేస్తూ ఉంటే మరి కొంత మంది మాత్రం ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అని అంటున్నారు. కొంత మంది ఆడపిల్లలని ఇలా గౌరవంగా చూడటం అనేది చాలా గొప్ప విషయం అని అంటున్నారు. ఆడపిల్లలు అంటేనే ఆలోచించే మనలాంటి దేశంలో ఒక ఆడపిల్లకి ఇలా చేయడం అంటే సాధారణమైన ఆలోచన కాదు అని కూడా అంటున్నారు. ఈ వీడియోలో ఉన్న వాళ్ళు ఎవరో, అసలు ఈ వీడియో ఎప్పటిది అనే విషయం ఎవరికీ తెలియదు. కానీ ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :
भावुक पल..
विदाई से पूर्व बेटी के पद-चिन्हों को घर में संजोकर रखते मां-बाप..💕#HeartTouching
VC : SM pic.twitter.com/kJdF8dj4e6— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) August 22, 2022
End of Article