Ads
‘జెర్సీ’ ఫేమ్ హరీష్ కళ్యాణ్ హీరోగా,ఇందూజ హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ ‘పార్కింగ్’. ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు రామకుమార్ బాలకృష్ణన్వహించారు.ఫ్యాషన్ స్టూడియోస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చింది. ఏ మూవీకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ శుక్రవారం చెన్నైలో ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు కూడా.
Video Advertisement
ఇక ఈ కార్యక్రమంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్, అరుణ్ రాజ్ ,కామరాజా, రవికుమార్, రతన్ కుమార్, రంజిత్ జయకొడి తదితరులు పాల్గొన్నారు. ఫుల్ మూవీ కథ విషయానికి వస్తే కాన్సెప్ట్ నిత్యం మనందరం ఎదుర్కొనే సమస్యతో కూడుకున్నది. పార్కింగ్.. మాల్ దగ్గర నుంచి ఇంటి ముందరి వరకు.. హాస్పిటల్ దగ్గర నుంచి రెస్టారెంట్ వరకు.. మనం ప్రతినిత్యం ఎదుర్కొనే అతి చిన్న సమస్యగా భావించే పెద్ద సమస్య ఇది.
మూవీ ట్రైలర్ ని పట్టి చూస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే ఒక హీరో.. అతను అద్దెకి తీసుకున్న ఒక చిన్న ఇల్లు. అంతా బాగానే జరుగుతుంది అనుకున్న సమయంలో పెళ్లి జరుగుతుంది. ఇక దీంతో అతని జీవితంలో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. పెళ్లయింది కాబట్టి కొత్త కారు కొంటాడు.. ఇక అక్కడ మొదలవుతుంది అసలు సమస్య.. అదేనండి పార్కింగ్ సమస్య. ఈ పార్కింగ్ ఇష్యూ ఎంత దూరం వెళ్తుంది అంటే హీరో ఓనర్ ఇద్దరు ఒకరినొకరు రక్తం వచ్చేలా కొట్టుకునేంతవరకు.. పోలీస్ కేస్ అయ్యేంతవరకు. చూశారా ఇంత చిన్న పార్కింగ్ సమస్య ఎంత పెద్ద సమస్య తెచ్చిందో.. మరి చివరికి దీని హీరో ఎలా పరిష్కరించాడు అనేది సినిమా స్టోర్.
watch video:
End of Article