“రావణాసుర” లో “రవితేజ” బాడీ లాంగ్వేజ్‌ సెట్ కాలేదు.. పరుచూరి కామెంట్స్..!

“రావణాసుర” లో “రవితేజ” బాడీ లాంగ్వేజ్‌ సెట్ కాలేదు.. పరుచూరి కామెంట్స్..!

by kavitha

Ads

మాస్ మహారాజ రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా ఏప్రిల్‌ 7న విడుదల అయ్యింది. ఈ చిత్రం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది.

Video Advertisement

ఈ మూవీలో అను ఇమ్మాన్యుయెల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటించగా, సుశాంత్ కీలక పాత్రలో నటించాడు. సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ‘రావణాసుర’ చిత్రం పై తన అభిప్రాయాన్ని తెలిపారు. పరుచూరి ఏమని చెప్పారో ఇప్పుడు చూద్దాం..
తాజాగా ఈ చిత్రాన్ని చూసిన పరుచూరి గోపాలకృష్ణ ఈ చిత్రం గురించి మాట్లాడారు. ఈ సినిమా రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు సెట్ అయ్యే  మూవీ కాదని ఆయన అన్నారు. ఈ మూవీకి మూలం బెంగాలీ చిత్రం అని కొందరు చెప్పారని, దాని పేరుని టైటిల్‌ కార్డుల్లో వేస్తే, కథ క్రెడిట్స్‌ రైటర్ కి ఇచ్చినట్లు ఉండేదని అన్నారు. ఒక వ్యాధి చికిత్స కోసం వాడిన మెడిసిన్ వల్ల హీరో తండ్రి మెంటల్ కండిషన్ పాడైపోయి తన చెల్లిని చంపడం, ఆ దృశ్యాన్ని చూసి అతని తల్లి మరణిస్తుంది.
అనారోగ్యంతో ఉన్న తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ, తన ఫ్యామిలీ ఇలా అవడానికి కారణమైన వారిని హీరో అంతం చేయడమే ‘రావణాసుర’ స్టోరీ. ఈ చిత్రం పగ, ప్రతీకారం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. అయితే ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకు చాలా చిత్రాలు వచ్చాయి. అవి సక్సెస్ అయ్యాయి. అయితే ఈ మూవీ ప్లాప్ గా నిలిచింది.
రవితేజ సినిమా అనగానే అద్భుతంగా నటించే మాస్‌ మహారాజ్‌ను ఆడియెన్స్ ఊహించుకుంటారు. అలాగే ఆయన మూవీ అనగానే  కామెడీ, ఫైట్స్‌, డైలాగ్స్‌, యాక్టింగ్ ఇలా అన్నీంటిని చూడాలని ఆడియెన్స్ థియేటర్‌కు వెళతారు. ఇక నా దృష్టిలో అయితే రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు సెట్ అయ్యే క్యారెక్టర్ కాదు. అలాగే ఈ మూవీ కట్స్‌ చాలా ఎక్కువ అవడం వల్ల ప్రేక్షకుడు ఒక సీన్ లో ఫీల్, నెక్స్ట్ సీన్ లో మారుతుంది. ఫీల్ కొనసాగకపోవడం ఆ మూవీకి  ప్రమాదకరం అని అన్నారు.
కట్స్‌తో పాటుగా ఎక్కువగా హత్యల సీన్స్ ఉన్నాయి. వరుసగా హత్యలు జరిగినప్పుడు పోలీసులు నిందితుడిని పట్టుకకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి సందర్భంలో హంతకుడు పోలీసుల నుంచి తప్పించుకుంటూ,వారికి దొరకకుండా వివిధ కోణాల్లో హత్యలు చేస్తుంటారు. కానీ ఈ మూవీలో జరిగే హత్యలన్నీ ఒకే విధంగా చూపించారు. అంతే కాకుండా హత్యలు చేసి కూడా పోలీసుల నుండి తప్పించుకోవచ్చు అనే మెసేజ్ ఆడియెన్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది.
ఇంతకు ముందు వచ్చిన ఇలాంటి సినిమాల్లో నిందితుడిని చివరికి పోలీసులు పట్టుకున్నట్టు చూపించారు. ఈ చిత్రంలో అలా చూపించలేదు. ఫ్యామిలీతో కలిసి చూసేందుకు అనుకూలంగా లేవు అని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు.

Also Read: “పోకిరి” నుండి “పుష్ప” వరకు… సమాజానికి “చెడు సందేశం” ఇచ్చిన 10 హిట్ సినిమాలు..!


End of Article

You may also like