అతను కరోనా పేషెంట్…ఆమె డాక్టర్…వారిదో వింత ఐసోలేషన్ లవ్ స్టోరీ.!

అతను కరోనా పేషెంట్…ఆమె డాక్టర్…వారిదో వింత ఐసోలేషన్ లవ్ స్టోరీ.!

by Megha Varna

Ads

ఇప్పటిదాకా ప్రపంచం ఎప్పుడూ చూడని విపత్తు కరోనా వైరస్.దీని కారణంగా ప్రపంచ దేశాలు అన్ని తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో మునిగిపోగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులు అయ్యారు.అంతేకాకుండా ఈ కరోనా ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది.ఎన్నో కుటుంబాలకు మర్చిపోలేని విపత్తు ను తెచ్చిపెట్టింది.అయితే ఈ కరోనా నేపథ్యంలో ప్రపంచం ఎప్పుడూ చూడని ఓ వింత లవ్ స్టోరీ తెరమీదకు వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది.ఓ లేడీ డాక్టర్ మరియు కరోనా పేషెంట్ ప్రేమించుకున్నారు..ఈ ఘటనకు సంభందించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

 

ఈజిప్ట్ లో అయా మోషాబ్ అనే లేడీ డాక్టర్ కరోనా రోగి అయినా ముహమ్మద్ ఫామి కి ఐసొలేషన్ వార్డ్ లో చికిత్స అందిస్తున్నారు.ముహమ్మద్ ఫామి తిరిగి కోలుకోవడానికి రెండు నెలల సమయం పట్టింది.అయితే ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది ముహమ్మద్ ఫామి పూర్తిగా కోలుకున్నాక అయా మోషాబ్ కు తన ప్రేమ వ్యక్తం చేసారు.అయితే అయా మోషాబ్ ఎస్ చెప్పారు.దీంతో ముహమ్మద్ ఫామి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ప్రేమ ఎప్పుడూ ,ఎలా పుడుతుందో తెలియదు అనడానికి ఇదే ప్రత్యేక్ష ఉదాహరణ అని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరైతే ఆసుపత్రిలో పైగా కరోనా పేషెంట్ తో ఇలా ఆ డాక్టర్ ప్రేమలో పడడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని అంటున్నారు.


End of Article

You may also like